News April 18, 2025
మామునూరు ఎయిర్‌పోర్టు.. నెక్స్ట్ ఏంటి?

మామునూరు ఎయిర్‌పోర్టుకు కేంద్రం పచ్చ జెండా ఊపిన విషయం తెలిసిందే. ఇందుకు 949ఎకరాలు అవసరమవగా 696ఎకరాలు సేకరించారు. మరో 253ఎకరాల కోసం 3గ్రామాలను ఒప్పించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అక్కడి భూముల ధరలు అమాంతం పెరగడంతో ఎకరాకు రూ.5కోట్లు ఇవ్వాలనే డిమాండ్ వచ్చింది. దీంతో ఎయిర్‌పోర్టు అంశం పట్టాలు తప్పినట్లేనా అని జిల్లా వాసులు అభిప్రాయపడుతున్నారు. సమస్యను క్లియర్ చేసి త్వరగా నిర్మించాలని కోరుతున్నారు.
Similar News
News April 19, 2025
కాజీపేట: మహిళా కానిస్టేబుల్ సూసైడ్

మహిళా కానిస్టేబుల్ ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హనుమకొండ జిల్లాలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. కాజీపేటలోని దర్గా ప్రాంతానికి చెందిన కానిస్టేబుల్ అర్చనకు 2022లో వివాహం జరిగింది. కొద్ది రోజులకే ఆమెకు భర్తతో విడాకులు కావడంతో మానసికంగా బాధపడింది. ఈ క్రమంలో ఆత్మహత్యకు పాల్పడింది.
News April 19, 2025
భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న మహబూబాబాద్ ఎంపీ

వరంగల్ మహానగరంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ భద్రకాళి అమ్మవారిని మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ ఈరోజు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజానంతరం మహా మండపంలో వేదపండితులు, అర్చకులు అమ్మవారి శేషవస్త్రములు బహూకరించి మహదాశీర్వచనం నిర్వహించి తీర్ధ ప్రసాదములు అందజేశారు.
News April 19, 2025
వరంగల్: ‘అత్తాన, పోతాన’.. ఇదే మన యాస, భాష

ప్రాంతాన్ని బట్టి భాష మాట్లాడే తీరు ఉంటుంది. WGL, KNR జిల్లాల్లో మాత్రం భాష కాస్త భిన్నంగా ఉంటుంది. KNR వారు అకారంతో మాట్లాడితే WGLలో ఒకారంతో మాట్లాడతారు. KNRలో వడ్లు అంటే WGLలో ఒడ్లు అంటాం. వేరే జిల్లాల్లో వస్తున్నా, వెళ్తున్నా అంటే మనం మాత్రం ‘అత్తాన, పోతాన’ అంటుంటాం. అచ్చిన, అట్లనా, అవ్వ, నాయిన, అప్పయ్య, జర ఆగు, షానా(చాలా), పైలం, బువ్వ అనే పదాలు వాడుతుంటాం. మీరెలా మాట్లాడుతారో కామెంట్ చేయండి.