News April 3, 2025

మారికవలసలో రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి

image

మధురవాడలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కొమ్మాది సాయిరాం కాలనీకి చెందిన బలగ ప్రభాకర్ (50) మరో వ్యక్తితో కలిసి బైక్‌పై వెళ్తుండగా.. మారికవలస నేషనల్ హైవేపై లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ వెనుక సీటులో కూర్చున్న ప్రభాకర్ లారీ చక్రాల కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్ డ్రైవ్ చేస్తున్న వ్యక్తి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. మృతదేహాన్ని కేజీహెచ్‌కి తరలించారు.

Similar News

News April 5, 2025

వేసవి రద్దీ నియంత్రణకు సింహాచలం మీదుగా ప్రత్యేక రైళ్ళు

image

వేసవి రద్దీ దృశ్య రద్దీని అరికట్టేందుకు సింహాచలం, దువ్వాడ మీదుగా ప్రత్యేక రైలు నడపనట్లు వాల్తేరు డివిజన్ డీసీఎం సందీప్ శుక్రవారం తెలిపారు. షాలిమర్ -చెన్నై వీక్లీ ఎక్స్ ప్రెస్ (02841/42) రైళ్ళు ఏప్రిల్ 7,14,21 తేదీలలో షాలిమర్ నుంచి సింహాచలం మీదుగా చెన్నై వెళ్ళనున్నట్లు పేర్కొన్నారు. తిరిగి ఏప్రిల్ 9,16,23 తేదీలలో చెన్నై నుంచి సింహాచలం మీదుగా షాలిమర్ వెళ్ళనున్నట్లు వెల్లడించారు.

News April 4, 2025

పవన్ కళ్యాణ్ మాటకు నిలబడి ఉంటాం: GVMC జనసేన కార్పొరేటర్లు

image

విశాఖ జనసేన పార్టీ ఆఫీసులో జీవీఎంసీ జనసేన కార్పొరేటర్లు శుక్రవారం సమావేశం నిర్వహించారు. పవన్ కళ్యాణ్ మాటకు నిలబడి ఉంటామని జనసేన కార్పొరేటర్లు అన్నారు. ‘అవిశ్వాసంలో పవన్ కళ్యాణ్ ఏది చెబితే అదే మా తుది నిర్ణయం’ అని అన్నారు. జీవీఎంసీ కౌన్సిల్ అవిశ్వాసంపై ఒకే తాటిపై ఉంటామని భీశెట్టి వసంతలక్ష్మి అన్నారు. త్వరలో కార్పొరేటర్లతో పవన్ కళ్యాణ్ సమావేశం కానున్నట్లు PAC సభ్యులు తాతారావు వెలెల్లడించారు.

News April 4, 2025

విశాఖ జూలో కాంట్రాక్ట్ పశువైద్యుని పోస్టుకు నోటిఫికేషన్

image

విశాఖలో ఇందిరా గాంధీ జూపార్క్‌లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన పశువైద్యుని పోస్టుకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు క్యూరేటర్ మంగమ్మ శుక్రవారం తెలిపారు. క్లినికల్ డిసిప్లిన్ సబ్జెక్టులలో మాస్టర్స్ చేసిన వారు అర్హులన్నారు. అనుభవం ఆధారంగా రూ.35,000 నెలవారీ వేతనంతో నియమిస్తామన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు రెజ్యూమ్‌ను విద్యా అర్హతలతో “పోస్ట్” ద్వారా ఏప్రిల్ 20లోపు ఇందిరా గాంధీ జూ పార్క్‌కు పంపాలన్నారు.

error: Content is protected !!