News February 25, 2025
మార్చి 1న HYD, రంగారెడ్డిలో రేషన్ కార్డుల పంపిణీ

కొత్త రేషన్ కార్డులు జారీ చేయడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలో మొదటిగా ఉమ్మడి రంగారెడ్డి, వికారాబాద్, HYD ప్రజలకు మార్చి1న అందించనున్నట్లు మంత్రి పొన్నం తెలిపారు. రంగారెడ్డిలో 24వేల కొత్త రేషన్ కార్డులు, వికారాబాద్‌లో 22 వేలు, మేడ్చల్‌లో 6వేలు, HYD 285 రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నారు. ఈ దరఖాస్తు ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని, దీనికి చివరి గడువంటూ ఏమీ లేదని అధికారులు చెబుతున్నారు.
Similar News
News February 25, 2025
పరిశ్రమల స్థాపన ద్వారానే ఆర్థిక ప్రగతి సాధ్యం: కలెక్టర్

శ్రీ సత్యసాయి జిల్లాలో పరిశ్రమల స్థాపన ద్వారా ఆర్థిక ప్రగతి సాధ్యమని కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్లో జిల్లా పరిశ్రమలు, ఎగుమతి ప్రోత్సాహక కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వ పరంగా చేయూతనివ్వాలని కలెక్టర్ సూచించారు.
News February 25, 2025
కొడంగల్: రైతుల భాగస్వామ్యం అభినందనీయం: కలెక్టర్

కొడంగల్ ప్రాంత అభివృద్ధిలో రైతుల భాగస్వామ్యం అభినందనీయమని వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు కోసం భూములు ఇచ్చేందుకు సమ్మతించిన దుద్యాల మండలం లగచర్ల రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 102లోని 22మంది రైతులకు రూ.6.38 కోట్ల చెక్కులను ఆయన ఆదివారం అందజేశారు. సబ్-కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్, అడిషనల్ కలెక్టర్ లింగ్య నాయక్, లైబ్రరీ ఛైర్మన్ రాజేష్ రెడ్డి ఉన్నారు.
News February 25, 2025
వరంగల్: ఎమ్మెల్సీ పోలింగ్ కేంద్రాన్ని సందర్శించిన డీసీపీ

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనుండటంతో వరంగల్ రంగశాయిపేటలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ కేంద్రాన్ని సెంట్రల్ జోన్ డీసీపీ షేక్ సలీమా మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎన్నికల వేళ చేపట్టాల్సిన బందోబస్తుతో పాటు మౌలిక సదుపాయాల ఏర్పాట్లపై డీసీపీ క్షేత్ర స్థాయిలో పర్యవేక్షించడంతో పాటు ఏసీపీ, ఇన్‌స్పెక్టర్లకు పలు సూచనలు చేశారు.