News April 5, 2025
మార్పు మనతోనే ప్రారంభించాలి: ఖమ్మం కలెక్టర్

మనం ఆశించే మార్పు మన ఇంటి నుంచే ప్రారంభించాలనే సూక్తిని బాబు జగ్జీవన్ రామ్ పాటించారని, తన కుమార్తెను ఉన్నత విద్య చదివించారని ఖమ్మం కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ తెలిపారు. శనివారం స్థానిక భక్త రామదాసు కళాక్షేత్రంలో షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 118వ జయంతి కార్యక్రమంలో జ్యోతి ప్రజ్వలన చేసి జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాల వేసి కేక్ కట్ చేశారు.
Similar News
News April 6, 2025
భద్రాచలం: తలంబ్రాల కౌంటర్ల వద్ద భక్తుల కిటకిట

భద్రాచలం సీతారాముల కళ్యాణ వేడుకను కనులారా వీక్షించేందుకు భక్తులు భారీగా తరలి వచ్చారు. దీంతో లడ్డూ ప్రసాదంతోపాటు మహా ప్రసాదం, స్వామివారి తలంబ్రాల కౌంటర్లు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. అటు ఆలయ పరిసరాలతో పాటు పట్టణంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. కాగా పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఆలయ పరిసరాల్లో పహారా కాస్తున్నారు.
News April 6, 2025
గెస్ట్ హౌస్ నుంచి మిథిలా స్టేడియానికి సీఎం

బూర్గంపాడు మండలం సారపాక ఐటీసీ గెస్ట్ హౌస్కు సీఎం రేవంత్ రెడ్డి చేరుకున్నారు. అక్కడి నుంచి భద్రాచల సీతారామ చంద్ర స్వామి వారి కళ్యాణానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, తెల్లం వెంకటరావుతో కలిసి మిథిలా స్టేడియానికి వెళ్లారు.
News April 6, 2025
మిథిలా స్టేడియానికి ఉత్సవమూర్తులు, తలంబ్రాలు

శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవ పూజలు ప్రారంభమయ్యాయి. ఉత్సవ మూర్తులను ఆలయ అర్చకులు మిథిలా స్టేడియానికి తీసుకువచ్చారు. కాగా ముత్యాల తలంబ్రాలను తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తీసుకువచ్చారు. దీంతో మిథిలా స్టేడియంలో ఉన్న భక్తుల్లో కోలాహలం నెలకొంది.