News March 10, 2025

మిర్యాలగూడ: ప్రణయ్ హత్య కేసు.. JUSTICE SERVED

image

ఆరేళ్ల క్రితం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన <<15709750>>ప్రణయ్ హత్య<<>> కేసుకు ఎట్టకేలకు తెరపడింది. ఈరోజు NLG కోర్టు ప్రధాన నిందితుడికి ఉరిశిక్ష, మిగతా వారికి యావజ్జీవ శిక్ష విధించింది. ప్రణయ్, అమృత పరిచయం నుంచి వారి ప్రేమ పెళ్లి.. గొడవలు.. కేసులు.. ప్రణయ్ హత్య.. మారుతీరావు సూసైడ్.. వాదనలు.. విచారణలు.. నేటి కోర్టు తీర్పు వరకు ప్రతి సందర్భం చర్చనీయాంశం అవగా ఫైనల్‌గా JUSTICE SERVED అని పలువురు అంటున్నారు.

Similar News

News March 10, 2025

అనకాపల్లి: ప్రజా వేదికలో 440 అర్జీలు

image

ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో తమ దృష్టికి వచ్చిన సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తామని అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ అన్నారు. సోమవారం స్థానిక కలెక్టరేట్‌లో ప్రజావేదిక కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. వాటిని పరిశీలించిన ఆమె సత్వర పరిష్కారానికి సంబంధిత అధికారులకు పంపించారు. మొత్తం 440 అర్జీలు వచ్చినట్లు తెలిపారు.

News March 10, 2025

సిరిసిల్ల: అట్రాసిటీ కేసుల పరిహారం పంపిణీ: కలెక్టర్

image

ఎస్సీ, ఎస్టీలకు అట్రాసిటీ కేసుల పరిహారం పంపిణీ చేసినట్టు సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్‌ఝా తెలిపారు. సిరిసిల్ల పట్టణంలోని కలెక్టరేట్లో సోమవారం ఆయన ప్రకటన విడుదల చేశారు. మొత్తం సిరిసిల్ల జిల్లాలోని 46 మంది బాధితులకు రూ 36,87,500 లను వారి వారి బ్యాంకు ఖాతాలో జమ చేసినట్టు ఆయన స్పష్టం చేశారు.

News March 10, 2025

ప్రధాని మోదీని కలిసిన ఈటల

image

TG: బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ప్రధాని మోదీని కలిశారు. ఈ సందర్భంగా ఈటల మనవడిని ముద్దు చేసిన మోదీ చాక్లెట్లు అందించారు. కుటుంబ సమేతంగా మోదీతో గడిపిన క్షణాలకు సంబంధించిన ఫొటోలను Xలో ఈటల పంచుకున్నారు. ప్రధానితో చాలా విలువైన సమయం గడిపానని, తన జీవితంలో ఈ క్షణాలను ఎప్పటికీ మర్చిపోనని రాసుకొచ్చారు.

error: Content is protected !!