News April 24, 2024

మిసెస్ ఇండియా 2024‌ ఫస్ట్ రన్నరప్‌గా HYDకి చెందిన సాఫ్ట్ వేర్

image

హైదరాబాద్‌కి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ శ్రుతీ చక్రవర్తి రాజస్థాన్, జైపూర్‌లో జరిగిన మిసెస్ ఇండియా బ్యూటీ కాంటెస్ట్‌లో ఫస్ట్ రన్నరప్‌గా నిలిచి అందరినీ అలరించారు. భరత్24 సమర్పణలో గ్లామానంద్ గ్రూప్ నిర్వహించిన కాంటెస్ట్‌లో మరో 20 మంది కంటెస్టెంట్స్‌తో పోటీపడిన శృతీ చక్రవర్తి.. ఏప్రిల్ 16న జరిగిన ఫైనల్‌లో ఫస్ట్ రన్నరప్‌‌గా నిలిచి ఎందరికో స్ఫూర్తిగా నిలిచింది.

Similar News

News November 26, 2024

HYD: 10 రోజుల్లోనే ఇంటి నిర్మాణానికి అనుమతి

image

హైదరాబాద్‌ వాసులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇకపై 10 రోజుల్లోనే ఇండ్ల నిర్మాణ అనుమతులు పొందవచ్చు. తాజాగా HMDA ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. ఇందులో భాగంగా పెండింగ్ అప్లికేషన్లకు వారం రోజుల్లోనే క్లియరెన్స్ ఇవ్వనున్నారు. గతంలో అనుమతుల కోసం 2 నుంచి 3 నెలల సమయం పట్టేదని.. ప్రజల కోసం ఈ ప్రక్రియ వేగవంతం చేసినట్లు ‘తెలంగాణ కాంగ్రెస్’ ట్వీట్ చేసింది.
SHARE IT

News November 26, 2024

HYDలో పెరిగిన చికెన్ ధరలు

image

హైదరాబాద్‌లో చికెన్ ధరలు పెరిగాయి. కార్తీకమాస చివరి సోమవారం ముగియడంతో‌ KGపైన రూ. 10 నుంచి రూ. 20 వరకు పెంచారు. గతవారం కిలో స్కిన్‌లెస్‌ రూ. 185 నుంచి రూ. 200 మధ్య అమ్మారు. మంగళవారం స్కిన్‌లెస్ రూ. 213 నుంచి రూ. 230 వరకు విక్రయిస్తున్నారు. విత్ స్కిన్ రూ. 187 నుంచి రూ. 200గా వ్యాపారులు ధరలు నిర్ణయించారు. మరి మీ ఏరియాలో ధరలు ఏ విధంగా ఉన్నాయి. కామెంట్ చేయండి.

News November 26, 2024

HYD: ఓయూ వెళ్లేవారికి గుడ్‌న్యూస్

image

ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ గేట్లు తెరిచి ఉంచే సమయాన్ని పెంచుతూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఓయూ వీసీ ప్రొఫెసర్ ఎం. కుమార్ భద్రతా సిబ్బందికి ఉత్తర్వులు జారీ చేశారు. అందరి అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇకపై తార్నాక నుంచి శివం రోడ్‌ వైపుగా వెళ్లే రహదారిలో గేట్లను రాత్రి తొమ్మిది గంటల వరకు తెరిచి ఉంచనున్నారు. ప్రస్తుతం ఈ గేట్లను రాత్రి ఎనిమిది గంటలకే మూసి వేస్తున్నారు. SHARE IT