News March 18, 2025

ముక్కలుగా నరికి మూట కట్టారు

image

అనకాపల్లి జిల్లా కశింకోట మండలం బయ్యవరంలో మహిళను ముక్కలుగా నరికి మూట కట్టేసి పడేశారు. దారుణంగా శరీర భాగాలు కట్ చేసి పడి ఉండడంతో స్థానికులు భయాందోళన చెందారు. దుప్పట్లో నడుము కింది భాగం, ఒక చేయి, కాళ్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మృతురాలి వయసు సుమారు 40 సంవత్సరాలు ఉంటుందని పోలీసులు పేర్కొన్నారు. ఘటనా స్థలంలో క్లూస్ టీం ఆధారాలు సేకరిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News March 19, 2025

భద్రాద్రి జిల్లా నేటి ముఖ్యాంశాలు..!

image

✓ పోడు రైతులకు జిల్లా కలెక్టర్ శుభవార్త ✓ గోదావరి ప్రాంత సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించిన ఎమ్మెల్యే పాయం ✓ అసెంబ్లీలో బీసీ, ఎస్సీ రిజర్వేషన్ బిల్లు ఆమోదం పట్ల జిల్లా వ్యాప్తంగా సంబరాలు ✓ సైబర్ నేరాలపై టేకులపల్లిలో అవగాహన ✓ అశ్వారావుపేటలో కబేళాకు తరలిస్తున్న మూగజీవాలు పట్టివేత ✓ అశ్వాపురం అడవుల్లో ఆగని మంటలు ✓ ఎస్సీ వర్గీకరణను అడ్డుకుంటాం: మాల మహానాడు ✓సీఎంతో భేటీ అయిన గుమ్మడి నరసయ్య.

News March 19, 2025

కామారెడ్డి జిల్లాలో నేటి ఉష్ణోగ్రతలు.

image

కామారెడ్డి జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. మంగళవారం గాంధారిలోని సర్వపూర్ 40.7°Cఉష్ణోగ్రత నమోదైంది. అలాగే పాల్వంచలోని ఎల్పుగొండ, బిచ్కుంద, రామారెడ్డి 40.5, మద్నూర్‌లోని సోమోర్,  బాన్సువాడలోని కొల్లూరు 40.4,జుక్కల్ 40.2,నసురుల్లాబాద్, నాగిరెడ్డి పేట్ 40.1, పిట్లo, పాల్వంచలోని ఇసాయిపేట్, సదాశివనగర్, దోమకొండ 40.0, భిక్నూరు, కామారెడ్డి 39.7°C గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.

News March 19, 2025

నర్వ: ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

image

నర్వ మండల కేంద్రంలోని ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ల్యాబ్, ప్రసూతి గది, ఇన్ పేషంట్ వార్డులను పరిశీలించారు. చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. ప్రసూతి గదిలో బేబి వార్మ్ యంత్రాన్ని ఏర్పాటు చేయాలని సిబ్బందికి సూచించారు. అన్ని రకాల మందులు అందుబాటులో పెట్టాలని, రోగులకు మెరుగైన వైద్యం అందించాలని చెప్పారు.

error: Content is protected !!