News March 26, 2025

ముఖ్యమంత్రి చేపట్టిన సదస్సులో పాల్గొన్న విశాఖ కలెక్టర్

image

రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మూడో విడత కలెక్టర్ల సదస్సు జరుగుతుంది. ఇందులో భాగంగా బుధవారం జరుగుతున్న సదస్సులో విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులు, పీ -4 సర్వే, పలు విషయాలపై చర్చించారు. కార్యక్రమంలో అనకాపల్లి కలెక్టర్ విజయ్ కృష్ణన్ ఉన్నారు.

Similar News

News April 1, 2025

ఏప్రిల్ 6న సింహాచలంలో శ్రీరామ నవమి వేడుకలు

image

సింహాచలం కొండపై గంగధార వద్ద ఉన్న సీతారామ స్వామి ఆలయంలో ఏప్రిల్ 6వ తేదీన శ్రీరామనవమి వేడుకలు నిర్వహించనున్నట్లు దేవస్థానం ఏవో సుబ్బారావు సోమవారం తెలిపారు. ఆరోజు ఉదయం 10:30 నుంచి దేవస్థానం అర్చకుల సమక్షంలో అత్యంత వైభవంగా స్వామివారి కల్యాణం నిర్వహించనున్నారు. ఆరోజున భక్తులు విచ్చేసి స్వామివారి కల్యాణ మహోత్సవంలో పాల్గొవాలన్నారు. స్వామి కళ్యాణానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఈవో సుబ్బారావు తెలిపారు.

News April 1, 2025

విశాఖ మేయర్‌ పీఠంపై వీడనున్న ఉత్కంఠ..!

image

విశాఖ మేయర్‌ పీఠంపై మరికొద్ది రోజుల్లో సస్పెన్ష్ వీడనుంది. మేయర్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టాలంటూ కలెక్టర్‌ ఎం.హరేంద్ర ప్రసాద్‌కు కూటమి కార్పొరేటర్లు నోటీసులు ఇవ్వగా.. ఏప్రిల్ 19న అవిశ్వాస తీర్మానంపై సమావేశం నిర్వహిస్తామని కలెక్టర్ కార్పొరేటర్లకు సమాచారం అందించారు. అయితే YCPకార్పొరేటర్లను అధిష్ఠానం బెంగుళూరు తరలించగా.. కూటమి కూడా తమ కార్పొరేటర్లను టూర్‌కు పంపేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. 

News March 31, 2025

జీవీఎంసీలో రూ.510 కోట్ల ఆస్తిపన్ను వసూలు

image

గ్రేటర్ విశాఖలో రూ.510కోట్లు ఆస్తిపన్ను వసూళ్లు అయినట్లు కలెక్టర్&ఇంచార్జి కమీషనర్ హరీందర్ ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా పన్నులు చెల్లించిన ప్రజలకు, వసూళ్లలో పాల్గొన్న జోనల్ అధికారులకు, ప్రజాప్రతినిధులకు అభినందనలు తెలిపారు. 2023-24 సంవత్సరంకు గాను రూ.454కోట్లు వసూళ్లు చేయగా.. 2024-25లో  రూ.510కోట్లు వసూళు చేయడం హర్షనీయమన్నారు. 

error: Content is protected !!