News February 25, 2025
ముఖ్రా(కె)లో చెట్లకు క్యూ ఆర్ కోడ్

ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముఖ్రా(కె) మాజీ సర్పంచ్ గాడ్గె మీనాక్షి పర్యావరణ పరిరక్షణకు కొత్తబాట వేశారు. ‘డిజిటల్ ట్రీ ఆధార్’తో ప్రతి చెట్టును జియో-ట్యాగ్ చేయడం, క్యూఆర్ కోడ్లను కేటాయించారు. పర్యావరణ బాధ్యత అంటే ఇదే! ప్రతి చెట్టు ఆధార్ కార్డులతో పౌరుల వలె వృద్ధి చెందేలా ఈ విప్లవాత్మక ఆలోచనకు మద్దతు ఇద్దామని BRS మాజీ ఎంపీ సంతోశ్ కుమార్ ఎక్స్ వేదికగా పోస్టు చేసి ఆమెను అభినందించారు.
Similar News
News February 25, 2025
ఆదిలాబాద్‌లో నేటి పత్తి ధర వివరాలు

ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో పత్తి కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయి. మార్కెట్లో మంగళవారం క్వింటాల్ సీసీఐ పత్తి ధర రూ.7,421గా, ప్రైవేట్ పత్తి ధర రూ.6,920గా నిర్ణయించారు. సోమవారం ధరతో పోలిస్తే మంగళవారం సీసీఐ ధరలో మార్పు లేదు. ప్రైవేట్ పత్తి ధర రూ.20 తగ్గినట్లు వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు వెల్లడించారు.
News February 25, 2025
ADB: 3 రోజులు పత్తి కొనుగోలు బంద్

ఈ నెల 26, 27, 28 తేదీల్లో జిల్లాలో పత్తి కొనుగోళ్లు నిలిపివేసినట్లు వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు మంగళవారం తెలిపారు. 26న మహాశివరాత్రి, 27న ఎమ్మెల్సీ ఎన్నికలు, 28న అమావాస్య ఉన్నందున కొనుగోళ్లు జరగవని వెల్లడించారు. మార్చి 1నుంచి కొనుగోళ్లు యథావిధిగా జరుగుతాయన్నారు. రైతులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని అధికారులు కోరారు.
News February 25, 2025
ఆదిలాబాద్‌లో యువకుడి దారుణ హత్య

ఆదిలాబాద్‌లో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. మార్కెట్ యార్డ్ వెనకాల ఇందిరానగర్‌లో రవితేజ (30) అనే వ్యక్తిని గుర్తుతెలియని వ్యక్తులు మంగళవారం ఉదయం హత్య చేసినట్లు డీఎస్పీ జీవన్ రెడ్డి వెల్లడించారు. ఘటనా స్థలంలో క్లూస్ టీమ్స్, డాగ్ స్క్వాడ్ బృందాలతో ఆధారాలు సేకరిస్తున్నట్లు పేర్కొన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్‌కు తరలించారు. మృతుడు క్రాంతినగర్ వాసిగా గుర్తించినట్లు తెలిపారు.