News December 21, 2024

ముచ్చటైన ముగ్గులకు ఆహ్వానం!

image

ధనుర్మాసం ప్రారంభమైంది. విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైన ఈ మాసంలో మహిళలు ఉదయాన్నే ఇంటి వాకిటను శుభ్రం చేసి ముగ్గులు వేస్తారు. న్యూ ఇయర్, సంక్రాంతి వరకు రంగురంగుల రంగవళ్లులను తీర్చిదిద్దుతుంటారు. మరి మీ అందమైన ముగ్గులను మాకు పంపండి. మీ పేరుతో Way2Newsలో మేము పబ్లిష్ చేస్తాం.
● ఇలా పంపండి: ముగ్గు ఫొటో, మీ పేరు, ఊరి పేరు, పాస్‌పోర్టు సైజు ఫొటోను 97036 22022కు వాట్సాప్ చేయండి.

Similar News

News December 22, 2024

విజయవాడ: కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌ను దారి మళ్లించిన అధికారులు

image

మోటుమర్రి జంక్షన్‌లో 3వ లైన్ పనులు జరుగుతున్నందున విజయవాడ మీదుగా CST ముంబై, భువనేశ్వర్ మధ్య ప్రయాణించే కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లను రైల్వే అధికారులు దారి మళ్లించారు. ఈ మేరకు నం.11019 & 11020 కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లు 2025 జనవరి 6 నుంచి 8 వరకు గుంటూరు – పగిడిపల్లి మీదుగా ప్రయాణిస్తాయన్నారు. ఆయా తేదీలలో ఈ రైళ్లు మధిర, ఖమ్మం టౌన్, మహబూబాబాద్, వరంగల్, ఖాజీపేటలో ఆగవని శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు.

News December 22, 2024

కృష్ణా: పీజీ డిప్లొమా పరీక్షల షెడ్యూల్ విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ(ANU) పరిధిలోని కాలేజీల్లో యోగాలో పీజీ డిప్లొమా కోర్స్ చదివే విద్యార్థులు రాయాల్సిన పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. 2023- 24 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఈ పరీక్షలు జనవరి 21 నుంచి నిర్వహించనున్నట్లు ANU పరీక్షల విభాగం తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ పరీక్షలు రాయాల్సిన విద్యార్థులు 2025 జనవరి 21లోపు ఎలాంటి ఫైన్ లేకుండా ఫీజు చెల్లించాలని, వివరాలకు ANU వెబ్‌సైట్ చూడాలంది.

News December 21, 2024

గంజాయి రహిత జిల్లాగా మారుద్దాం: కలెక్టర్ 

image

జిల్లాలో గంజాయి, డ్రగ్స్ ఆనవాళ్లు లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ, జిల్లా ఎస్పీ ఆర్ గంగాధరరావుతో కలిసి మాదకద్రవ్యాల దుర్వినియోగంపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దాలన్నారు. పలువురు సిబ్బంది పాల్గొన్నారు.