News September 22, 2024
ముద్దనూరు: సినీ ఫక్కిలో దొంగతనం

కడప- తాడిపత్రి ప్రధాన జాతీయ రహదారి సమీపంలోని బొందలకుంట గ్రామంలో శనివారం సినీ ఫక్కిలో దొంగతనం జరిగింది. వివరాల్లోకి వెళితే.. బొందకుంట రహదారిలో బైక్‌పై వెళ్తున్న అదే గ్రామానికి చెందిన మంగపట్నం పుల్లయ్య, సుబ్బమ్మలను పోలీసులమని చెప్పి ఆపి.. వారి వద్ద ఉన్న బంగారు చైను, ఉంగరం అపహరించుకుపోయారు. విషయం తెలుసుకున్న ముద్దనూరు సీఐ దస్తగిరి, SI మైనుద్దీన్‌లు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.
Similar News
News January 10, 2025
వైఎస్ అభిషేక్ రెడ్డి కన్నుమూత

వైసీపీ నేత వైఎస్ అభిషేక్ రెడ్డి మృతి చెందారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో హైదరాబాదులోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఇవాళ తుదిశ్వాస విడిచారు. రేపు ఉదయం 9 గంటలకు పులివెందులలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్ అంత్యక్రియల్లో పాల్గొననున్నారు. అభిషేక్ రెడ్డి వైఎస్ ప్రకాశ్ రెడ్డికి మనమడు.
News January 10, 2025
నేటి నుంచి సెలవులు: కడప డీఈవో

అకడమిక్ క్యాలెండర్ ప్రకారం ఇవాళ్టి నుంచి కడప జిల్లాలో సంక్రాంతి సెలవులు ఇస్తున్నామని డీఈవో మీనాక్షి వెల్లడించారు. జనవరి 19 వరకు సెలవులు ఉంటాయని చెప్పారు. 20న పాఠశాలలు పునః ప్రారంభమవుతాయన్నారు. మైనారిటీ విద్యాసంస్థలకు జనవరి 11 నుంచి 15 వరకు ఉంటాయని స్పష్టం చేశారు. సెలవుల్లో తరగతులు నిర్వహించరాదని.. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని DEO హెచ్చరించారు.
News January 9, 2025
కడప: హత్య కేసులో ఐదుగురికి శిక్ష

తొర్రివేములకు చెందిన కుమ్మరి గురు ప్రసాద్ 2019లో హత్యకు గురయ్యారు. ఈ కేసులో ఐదుగురు నిందితులకు గురువారం కోర్టు శిక్ష విధించింది. వివరాల్లోకి వెళ్తే.. హతుడి భార్య ప్రమీలకు తీట్ల సురేశ్ అనే వ్యక్తితో వివాహేతర బంధం ఉంది. వారి బంధానికి భర్త అడ్డంకిగా మారడంతో మరో ముగ్గురితో కలిసి ప్రసాద్‌ను హత్య చేశారు. కేసును విచారించిన 2nd ADJ కోర్ట్ జడ్జి G. S రమేశ్ కుమార్ వారికి జీవిత ఖైదు విధించారు.