News February 18, 2025

ముద్దనూరులో రోడ్డు ప్రమాదం

image

ముద్దనూరు మండలంలోని తిమ్మాపురం గ్రామ సమీపంలో సోమవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. కడప నుంచి గండికోట వెళ్తుండగా ఇన్నోవా వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని ప్రొద్దుటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News March 13, 2025

కడప: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి లోకేశ్

image

కడప జిల్లాలోని కాశినాయన క్షేత్రంలోని పలు షెడ్లను అటవీ అధికారులు కూల్చివేసిన విషయం తెలిసిందే. దీనిపై వైసీపీ, కూటమి నాయకులు వాడీవేడీగా మాటల యుద్ధం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి లోకేశ్ స్పందించి.. తన సొంత నిధులతో పునర్నిర్మిస్తామని హామీ ఇచ్చారు. 24 గంటల్లో ఇచ్చిన మాట ప్రకారం.. నూతన షెడ్ల నిర్మాణం పనులను మొదలుపెట్టారు. దీంతో పలువురు హర్షం వ్యక్తం చేశారు.

News March 13, 2025

కడపలో చదువుల తల్లి ఇక లేదు

image

కడపలో బుధవారం హృదయాన్ని కలిచివేసే ఘటన చోటు చేసుకుంది. కడపకు చెందిన ఆయేషా ఇంటర్మీడియట్ సెకెండ్ ఇయర్ చదువుతోంది. ఆరోగ్యం సరిగ్గా లేకపోవడంతో బుధవారం ఫిజిక్స్ రాస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలింది. వెంటనే సిబ్బంది దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ చనిపోయింది. ఆయేషా పదో తరగతిలో 592, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 425 మార్కులు సాధించింది. దీంతో ఆమె తల్లిదండ్రులు బోరున విలపించారు.

News March 13, 2025

2025లో చంద్రగ్రహణం లేదు: కడప అర్చకులు

image

ఈ నెల 14వ తేదీ చాలామంది చంద్రగ్రహణం ఉందని భావిస్తున్నారు. కానీ 2025 సంవత్సరంలో చంద్రగ్రహణం, సూర్యగ్రహణం మన భారతదేశానికి వర్తించదని విశ్వహిందూ పరిషత్ కడప జిల్లా అర్చక పురోహితులు విజయ భట్టర్ తెలిపారు. కడపలో ఆయన మాట్లాడుతూ.. పండితులు సిద్ధాంతాలు పంచాంగ కర్తలు ప్రకారం ఈ సంవత్సరంలో ఎటువంటి సూర్య, చంద్ర గ్రహణాలు మన దేశానికి వర్తించవని స్పష్టం చేశారు.

error: Content is protected !!