News February 9, 2025

ముధోల్: ఇంటి నిర్మాణాల తవ్వకాల్లో పురాతన నాణేలు 

image

ముధోల్ మహాలక్ష్మిగల్లీకి చెందిన లూటే మారుతి పటేల్ ఇంటిని నిర్మాణ పనులను శుక్రవారం చేపట్టారు. పిల్లర్ కోసం తవ్వుతుండగా మట్టి కుండలో 92 అతి పురాతన నాణేలు లభ్యమయ్యాయి. సమాచారం తెలుసుకున్న ఎస్ఐ సంజీవ్, తహశీల్దార్ శ్రీకాంత్ సిబ్బందితో కలిసి ఘటన స్థలాన్ని చేరుకొని తవ్వకాల్లో బయటపడ్డ నాణేలను పరిశీలించారు. నాణేలను జిల్లా ఖజానా కార్యాలయంలో జమ చేస్తున్నట్లు తహశీల్దార్ పేర్కొన్నారు.

Similar News

News February 9, 2025

NKP: చెర్వుగట్టులో ఘనంగా పూర్ణాహుతి

image

చెర్వుగట్టు శ్రీపార్వతీ జడల రామలింగేశ్వరస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా పూర్ణాహుతి, ఏకాంత సేవలను వైభవంగా నిర్వహించారు. దేవాలయ ప్రధాన అర్చకుడు పోతులపాటి రామలింగేశ్వర శర్మ, ఆర్చక బృందం ఆధ్వర్యంలో మహా పూర్ణహుతి, హోమం, ధ్వజారోహణం, ఏక దశ రుద్రాభిషేకం, జ్యోతి లింగార్చన, ఏకాంతసేవ పూజా కార్యక్రమాలను నిర్వహించారు. కార్యక్రమంలో ఆయల ఈఓ నవీన్ కుమార్, తిరుపతి రెడ్డి పాల్గొన్నారు.

News February 9, 2025

వెంకన్న సేవలో మంత్రి సవిత

image

మంత్రి సవిత ఆదివారం వేకువజామున తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సుప్రభాత సేవలో పాల్గొన్న ఆమె స్వామివారిని దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. ముందుగా ఆమెకు శ్రీవారి ఆలయంలో టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో మంత్రికి అధికారులు తీర్థప్రసాదాలను అందజేశారు.

News February 9, 2025

ప్రకాశం జిల్లా పునర్విభజనపై మీ కామెంట్..!

image

అద్దంకిని బాపట్ల, కందుకూరును నెల్లూరు జిల్లాలో విలీనం చేశారు. ఆ రెండు ఏరియాల ప్రజలకు గతంలో 50KM లోపే జిల్లా కేంద్రం(ఒంగోలు) ఉండేది. ఇప్పుడు ఆ దూరం పెరిగింది. ప్రస్తుతం మార్కాపురాన్ని జిల్లా చేసేందుకు అడుగులు పడుతున్నాయి. ఇదే సమయంలోనే అద్దంకి, కందుకూరును తిరిగి ప్రకాశంలో కలపాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. మరి మీ ఏరియాను మార్కాపురం లేదా ప్రకాశం జిల్లాలో ఎక్కడ ఉంచాలో కామెంట్ చేయండి.

error: Content is protected !!