News April 10, 2025

ములుగు: UPDATE.. మద్యానికి డబ్బు ఇవ్వలేదని హత్య

image

ములుగు జిల్లా వాజేడు మండలంలో <<16046948>>దారుణ హత్య జరిగిన విషయం<<>> తెలిసిందే. సీఐ కుమార్ తెలిపిన వివరాలు.. టేకులగూడెంకు చెందిన బుల్లబ్బాయి మద్యానికి డబ్బు ఇవ్వాలని తన అన్న విజయబాబును అడిగాడు. తన వద్ద లేవని చెప్పడంతో కోపంతో పదునైన ఆయుధంతో ముఖంపై దాడి చేసి హత మార్చాడు. విజయబాబు చిన్న తమ్ముడు రాజేంద్రప్రసాద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ చెప్పారు.

Similar News

News December 15, 2025

‘AGRATE’ ఏం చేస్తుంది?

image

‘AGRATE’ చిన్న రైతులకు నాణ్యమైన విత్తనాలు, డ్రిప్ ఇరిగేషన్, ఆధునిక వ్యవసాయ పరికరాలు, సేంద్రియ ఎరువులను తక్కువ ధరకే అందిస్తోంది. అలాగే కొమ్మలను అంటుకట్టడం, ఎక్కువ పంటల సాగు, స్థిరమైన వ్యవసాయ విధానాలపై రైతులకు ఆధునిక శిక్షణ ఇవ్వడంతో పంట దిగుబడి పెరిగింది. ITC, Godrej, Parle వంటి కంపెనీలతో శుక్లా ఒప్పందం చేసుకోవడంతో రైతుల ఉత్పత్తులకు మార్కెట్ అవకాశాలు పెరిగి వారి ఆదాయం గణనీయంగా పెరిగింది.

News December 15, 2025

ఈ నెల 19న శోభన్ బాబు ‘సోగ్గాడు’ రీరిలీజ్

image

టాలీవుడ్ సీనియర్ హీరో శోభన్ బాబు నటించిన ‘సోగ్గాడు’ చిత్రం ఈ నెల 19న రీరిలీజ్ కానుంది. చిత్రం విడుదలై 50 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా అదే రోజున HYDలో స్వర్ణోత్సవ వేడుకను నిర్వహించనున్నారు. సురేశ్ ప్రొడక్షన్స్‌కు ఈ మూవీ మంచి పేరు తీసుకొచ్చిందని నిర్మాత సురేశ్ బాబు తెలిపారు. నటుడిగానే కాకుండా వ్యక్తిగానూ శోభన్ బాబుకు ప్రత్యేక స్థానం ఉందని సీనియర్ నటుడు మురళీమోహన్ అన్నారు.

News December 15, 2025

పార్వతీపురం: బైక్ మీద నుంచి జారిపడి మహిళా మృతి

image

సీతానగరం మండలం అంటిపేట జాతీయ రహదారిపై బైక్ మీద నుంచి జారిపడి మహిళా మృతి చెందిన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రామవరం పంచాయతీ రెడ్డివానివలసల గ్రామానికి చెందిన రెడ్డి విజయలక్ష్మి ద్విచక్ర వాహనంపై వస్తుండగా ప్రమాదవశాత్తు పడిపోవడంతో తలకు తీవ్ర గాయం అయింది. దీంతో ఆమెను బొబ్బిలి ప్రాంతీయ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించింది.