News May 11, 2024

ములుగు: అన్నం పెట్టడం లేదని.. సెల్ టవర్ ఎక్కాడు!

image

ఇంట్లో వాళ్ళు తనకు అన్నం పెట్టడం లేదని అలిగి ఓ యువకుడు సెల్ టవర్ ఎక్కిన సంఘటన ములుగు జిల్లా కమలాపురంలో చోటుచేసుకుంది. శ్యామల రాజేశ్ అనే యువకుడు శనివారం మధ్యాహ్నం ఇంట్లో అన్నం పెట్టడం లేదని గొడవ పెట్టుకున్నాడు. అనంతరం పక్కనే ఉన్న సెల్ టవర్ ఎక్కి నిద్రపోయాడు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు టవర్ వద్దకు చేరుకుని రాజేశ్‌ని కిందికి దింపి కౌన్సిలింగ్ ఇచ్చి ఇంటికి పంపించేశారు.

Similar News

News March 14, 2025

వరంగల్: నగర ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపిన మేయర్  

image

హోలీ పండుగ సందర్భంగా నగర మేయర్ గుండు సుధారాణి నగర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రేమ ఆప్యాయత సంతోషాల హరివిల్లుగా, శాంతి సౌభ్రాతృత్వానికి ప్రత్యేకంగా నిలిచే ఈ హోలీ పండుగను అందరూ ఆనందంగా జరుపుకోవాలన్నారు. సహజ సిద్ధమైన రంగులతో సాంప్రదాయ పద్ధతులతో ఈ రంగుల పండుగను ఆనందంతో సంతోషంగా జరుపుకోవాలని మేయర్ ఆకాంక్షించారు. 

News March 14, 2025

వరంగల్: హోలీ శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్

image

హోలీ పండుగను పురస్కరించుకొని వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారద జిల్లా ప్రజలకు హోలీ వేడుక శుభాకాంక్షలు తెలియజేశారు. రాగద్వేషాలకు అతీతంగా అందర్నీ ఒకటి చేసే ఈ హోలీ పండుగ వేడుక ప్రజలందరి జీవితాలలో సంతోషంతో వెలుగులో నింపాలని ఆకాంక్షించారు. జిల్లా ప్రజలు ఆనంద ఉత్సాహాలతో హోలీ వేడుకలు జరుపుకోవాలని అన్నారు. సహజ రంగులను వినియోగిస్తూ సాంప్రదాయబద్ధంగా పోలి నిర్మించుకోవాలని కలెక్టర్ కోరారు. 

News March 14, 2025

WGL: బాల్యంలో ఈ పూలతోనే హోలీ (PHOTO)

image

వరంగల్‌ల్లో ఓ చెట్టుకు విరబూసిన పూలు మన బాల్యాన్ని గుర్తుచేస్తున్నాయి. ఒంటిపూట బడికెళ్తుంటే రోడ్డు పక్కనే ఇవి గుబాలించేవి. ఈ పూల మకరందం రుచిచూసి మైమరచిన బాల్యం మళ్లీ గుర్తొస్తోంది. పండగొస్తుంది అనే సంబరంలో ఎండలో తిరిగి ఈ పూలను ఒకరోజు ముందే సేకరించేవాళ్లం. నీటిలో ఉడికించి రంగు ఊరిన నీళ్లతో ఆడిన హోలీ బాల్యంలో ఓ మధురజ్ఞాపకమే. ఈ ఏడాదైనా మోదుగ పూలతో హోలీ జరుపుకోండి. HAPPY HOLI

error: Content is protected !!