News March 5, 2025

ములుగు: ఇంటర్ పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు: ఎస్పీ

image

నేడు ములుగు జిల్లా వ్యాప్తంగా జరగబోయే ఇంటర్ పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీశ్ ఐపీఎస్ ఒక ప్రకటనలో తెలిపారు. అదే విధంగా పరీక్షా కేంద్రం సమీపంలో ఉన్న జిరాక్స్ సెంటర్లు అన్నీ కూడా మూసివేయాలని ఆదేశించారు. పరీక్ష కేంద్రాల్లో ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకెళ్లరాదని తెలిపారు.

Similar News

News March 5, 2025

నల్గొండ: నేడే పరీక్షలు.. ALL THE BEST

image

రాష్ట్ర వ్యాప్తంగా నేడు ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి. నల్గొండ జిల్లా వ్యాప్తంగా 28,722 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. ఫస్టియర్ 13,992 సెండియర్‌లో 14,730 మంది విద్యార్థులు రాయనుండగా.. 52 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షల నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశించారు. కాగా, పరీక్షకు 30 నిమిషాలకు ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోండి. ALL THE BEST

News March 5, 2025

నిడమర్రు: ఆక్వా రైతు ఆత్మహత్య

image

అప్పుల బాధ తాళలేక ఆక్వా రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన నిడమర్రు(M) గుణపర్రులో జరిగింది. గ్రామంలో రొయ్యలు చెరువు సాగు చేస్తున్న నిమ్మల శ్రీను సుమారు రూ.కోటి మేర నష్టపోయాడు. అప్పులు తీర్చలేనని మనోవేదనకు గురై విషం తాగాడు. ఆ తర్వాత సోదరుడికి ఫోన్ చేయడంతో బంధువులు గాలించి చెరువు వద్ద ఉన్నట్లు గుర్తించారు. ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

News March 5, 2025

గుండెపోటుతో యువకుడి మృతి..! 

image

గుండెపోటుతో యువకుడు మృతి చెందిన ఘటన సత్తుపల్లి మండలంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. మండలంలోని గంగారం గ్రామానికి చెందిన గజవెల్లి ప్రేమ్ సాగర్(సుబ్బు) అన్నం తిన్న తరువాత ఛాతిలో నొప్పి వస్తుందని కుప్పకూలాడు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

error: Content is protected !!