News February 13, 2025
ములుగు: ఇసుక అక్రమ రవాణాపై ఎస్పీ నజర్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739374311184_51702158-normal-WIFI.webp)
ములుగు జిల్లాలో ఇసుక అక్రమ రవాణా నియంత్రణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని ఎస్పీ శబరీశ్ ఆదేశించారు. ప్రభుత్వ నిబంధనల మేరకు నిర్దేశించిన ప్రాంతాల్లో రుసుము చెల్లించి తవ్వకాలు చేపట్టాలన్నారు. జిల్లాలోని వాగులు, నది పరివాహక ప్రాంతాల్లో ఇసుక అక్రమ తవ్వకాల ప్రాంతాలను గుర్తించి నిఘా ఏర్పాటు చేయాలన్నారు. ఇసుక అక్రమ రవాణా చేసిన, నిల్వ ఉంచిన చట్ట ప్రకారం జరిమానా, కేసులు నమోదు చేయాలన్నారు.
Similar News
News February 13, 2025
MTM: వల్లభనేని వంశీ అరెస్ట్.. ఎస్పీ కీలక ప్రకటన
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739429607314_51768855-normal-WIFI.webp)
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ నేపథ్యంలో కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్ గంగాధర రావు కీలక ప్రకటన విడుదల చేశారు. జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్‌తో పాటు పోలీస్ యాక్ట్- 30 అమలులో ఉన్న నేపథ్యంలో నిరసనలు, ర్యాలీలు పూర్తిగా నిషేధమన్నారు. పోలీసుల నిషేధాజ్ఞలను అతిక్రమించి వ్యవహరించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.
News February 13, 2025
దామరగిద్ద: మన్యంకొండ జాతరకు వెళ్తే ఇళ్లు దోచారు !
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739415706424_51771152-normal-WIFI.webp)
దామరగిద్ద మండలంలోని ఉల్లిగుండం గ్రామానికి చెందిన చాలామంది తమ ఇంటి ఇలవేల్పు మన్యంకొండ జాతర రథోత్సవానికి ఎడ్లబండ్లతో బయలుదేరి వెళ్లారు. ఇదే అదునుగా భావించిన దుండగులు ఆ గ్రామంపై కన్నేశారు. బుధవారం అర్ధరాత్రి పలు ఇళ్లలో చోరీకి పాల్పడ్డారు. వెంటనే స్థానికులు గమనించి వారిని వెంబడించగా.. వారు తెచ్చుకున్న బైక్ వదిలి పారిపోయినట్లు స్థానికులు వాపోతున్నారు. పోలీసులు చేరుకొని విచారణ చేపట్టారు.
News February 13, 2025
సిద్దిపేట: బర్డ్ ఫ్లూ దెబ్బ.. చికెన్ ధరలు అబ్బా
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739426928105_1243-normal-WIFI.webp)
తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ వ్యాధి కలకలం రేపుతుంది. బర్డ్ ఫ్లూ భయంతో పలు ప్రాంతాల్లో చికెన్ అమ్మకాలు భారీగా పడిపోయి ధరలు అమాంతం తగ్గాయి. జిల్లా వ్యాప్తంగా కొన్ని రోజుల క్రితం కేజీ రూ.220 ఉండగా ప్రస్తుతం రూ.170గా ఉంది. కోళ్లలో అసాధారణ మరణాలు, ఏమైనా వ్యాధి లక్షణాలుంటే సమాచారం ఇవ్వాలని జిల్లా పశువైద్యాధికారులు తెలిపారు.