News February 9, 2025

ములుగు: గుప్పుమంటున్న గుడుంబా

image

కన్నాయిగూడెం మండలంలో గుడుంబా గుప్పుమంటుంది. పలు గ్రామాల్లో రహస్యంగా గుడుంబా విక్రయిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. ఇదిలా ఉండగా పలు ప్రాంతాల్లో గుడుంబా విక్రయ, తయారీదారులపై పోలీసులు దాడులు నిర్వహిస్తున్నప్పటికీ గుడుంబా మహమ్మారి అడ్డుకట్ట పడడం లేదన్నారు. బుట్టాయిగూడెంలోని ఓ ప్రాంతంలో గుడుంబా తాగి స్పృహ కోల్పోయి కాల్వలో పడిన ఓ వ్యక్తి ఫొటోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.

Similar News

News February 9, 2025

నెల్లూరులో యువకుడి దారుణ హత్య

image

నెల్లూరు నగరంలో శనివారం దారుణ హత్య జరిగింది. నవాబుపేట PS పరిధిలోని ఉడ్ హౌస్ ప్రాంతానికి చెందిన కోడూరు కళ్యాణ్ అలియాస్ చిన్నాపై గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. స్థానికులు ఆయన్ను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తిపై నవాబుపేట PSలో సస్పెక్ట్ రౌడీ షీటర్‌ నమోదైనట్లు పోలీసులు తెలిపారు. DSP సింధుప్రియా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News February 9, 2025

ఆ ఫోన్ నంబర్లు వస్తే ఫోన్ ఎత్తకండి: సీఐ రమేశ్ బాబు

image

ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి #90, #09ను డయల్ చేయమంటే చేయొద్దని, అలా చేస్తే మీ సిమ్‌ని వారు యాక్టివేట్ చేసుకుని నేరాలకు పాల్పడే అవకాశం ఉందని త్రీ టౌన్ సీఐ రమేశ్ బాబు తెలిపారు. అట్లాగే +3, +5, +9, +2 సిరీస్‌తో వచ్చే ఫోన్ నంబర్లను అస్సలు లిఫ్ట్ చేయవద్దని సూచించారు. మిస్డ్ కాల్ వచ్చిందని ఆ నంబర్లకు ఫోన్ చేస్తే మూడు సెకన్లలో ఫోన్‌లో ఉన్న డేటాను హ్యాక్ చేస్తారని తెలిపారు.

News February 9, 2025

భువనగిరిలో పోలీసుల ఫుట్ పెట్రోలింగ్ 

image

భువనగిరిలో ప్రజలకు పోలీసుల సేవలు మరింత చేరువ కావాలన్న ఆలోచనతో పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పట్టణంలోని హనుమన్వాడ, సంజీవ్ నగర్, పహాడీ నగర్లలో ఫుట్ పెట్రోలింగ్ నిర్వహిస్తున్నట్లు సీఐ సురేశ్ కుమార్ తెలిపారు. పోలీసులు ప్రజలకు అందించే సేవలను వివరించారు. ఎవరైనా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎస్ఐలు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

error: Content is protected !!