News April 16, 2024
ములుగు జిల్లాలో అరుదైన పాము మృతి
రోడ్డు ప్రమాదంలో అరుదైన పాము మృతి చెందిన ఘటన ములుగు జిల్లాలో జరిగింది. ఏటూరునాగారం మండలం జీడివాగు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో బంగారస్ అనే పాము మృతి చెందింది. ఇటువంటి పామును ఈ ఏరియాలో చూడడం ఇదే మొదటి సారని స్థానికులు తెలిపారు. బంగారస్ అనే పాము ఆసియాకు చెందిన ఎలా పిడ్ల జాతికి చెందిందని, అత్యంత విషపూరిత పామని స్థానిక పశువైద్యులు తెలిపారు.
Similar News
News January 10, 2025
పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ పనులపై సమీక్ష
పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ పనులపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. సమావేశంలో జిల్లాకు చెందిన మంత్రులు కొండా సురేఖ, సీతక్క పాల్గొన్నారు. అనంతరం పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలకు సంబంధించి పలు అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు.
News January 10, 2025
అధికారులతో సమీక్ష నిర్వహించిన జిల్లా MHBD కలెక్టర్
మహబూబాబాద్ కలెక్టరేట్లో జిల్లా స్థాయి సహకార అభివృద్ధి కమిటీ సమావేశాన్ని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో సహకార సంఘాల బలోపేతం ద్వారా ఆర్థిక పరిపుష్టి సాధించవచ్చని, ప్రభుత్వం సహకార సంఘాల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత కల్పిస్తుందని తెలిపారు. జిల్లాలో కామన్ సర్వీస్ సెంటర్‌ను ప్రారంభించి సేవలను అందిస్తున్నట్లు తెలిపారు.
News January 9, 2025
అత్యుత్తమ బోధనలు అందించేలా చర్యలు తీసుకోవాలి: కలెక్టర్
మహబూబాబాద్ కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అధికారులతో కలిసి విద్యాశాఖ, రోడ్డు భద్రత జాతీయ మాసోత్సవాలపై సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని అన్ని పాఠశాలలు, వసతి గృహాల్లో చదువుతున్న పిల్లలకు ప్రతి సబ్జెక్టులో అర్థమయ్యే రీతిలో అత్యుత్తమ బోధనలు అందించేలా చర్యలు తీసుకోవాలని ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు. పదవ తరగతి పరీక్షల్లో జిల్లాను మొదటి స్థానంలో ఉంచాలన్నారు.