News March 31, 2025

ములుగు జిల్లాలో చికెన్ ధరలకు రెక్కలు!

image

ములుగు జిల్లాలో చికెన్ ధరలకు రెక్కలొచ్చాయి. ఒక్కసారిగా చికెన్ ధరలు పెరగడంతో సాధారణ ప్రజలు కోడి కూర తినే పరిస్థితి లేదని వాపోతున్నారు. ఇటీవల రూ.200, రూ.220 పలికిన కేజీ చికెన్ ధర ఒక్కసారిగా రూ.260, రూ.280కి చేరడంతో పండగల వేల చికెన్ కొనలేని పరిస్థితి నెలకొందన్నారు. బర్డ్ ఫ్లూ కారణంగా లక్షల సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడడంతో సరఫరా తగ్గిందని వ్యాపారులు చెబుతున్నారు.

Similar News

News April 3, 2025

IPL: KKRపై SRH పైచేయి సాధిస్తుందా?

image

ఐపీఎల్‌లో భాగంగా ఇవాళ KKR-SRH మధ్య మ్యాచ్ జరగనుంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. రెండు వరుస ఓటములతో డీలాపడ్డ ఆరెంజ్ ఆర్మీ తిరిగి పుంజుకోవాలని భావిస్తోంది. కేకేఆర్‌ను ఓడించి మళ్లీ విన్నింగ్ ట్రాక్‌లోకి రావాలని పట్టుదలగా ఉంది. మరోవైపు కేకేఆర్ ఒక గెలుపు, రెండు ఓటములతో పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉంది. ఈ మ్యాచులో గెలిచి సత్తా చాటాలని ఎదురుచూస్తోంది.

News April 3, 2025

భారత్‌లో భూకంపాలు వచ్చే ప్రదేశాలు ఇవే!

image

మయన్మార్‌లో భూకంపం సంభవించి వేలాది మంది ప్రజలు మృత్యువాత పడిన విషయం తెలిసిందే. కాగా మనదేశంలో కూడా భూప్రకంపనలు సంభవించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, JK ప్రాంతాలు 9 తీవ్రతతో భూకంపాలు వచ్చే జోన్ పరిధిలో ఉన్నాయి. ఢిల్లీ, హరియాణా, మహారాష్ట్రలో 8, రాజస్థాన్, కొంకణ్ తీరంలో 7, కర్ణాటక, TG, AP, ఒడిశా, MPలో 7 కంటే తక్కువ తీవ్రతతో భూకంపాలు సంభవించే అవకాశం ఉందని చెబుతున్నారు.

News April 3, 2025

స్టైలిష్ లుక్‌లో ఎన్టీఆర్.. పిక్స్ వైరల్

image

యంగ్‌టైగర్ ఎన్టీఆర్ స్టైలిష్ లుక్‌లో కనిపించారు. బ్లాక్ అండ్ వైట్ అవుట్‌ఫిట్‌లో కళ్లద్దాలు ధరించి స్టన్నింగ్ లుక్‌లో మెరిశారు. టోక్యోలోని ఓ స్టార్ హోటల్‌లో ఈ ఫొటోలకు పోజులిచ్చారు. ఇందుకు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఫొటోలను తన అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు. కాగా ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఓ మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే.

error: Content is protected !!