News February 4, 2025
ములుగు: తుడందెబ్బ మొదటి మహిళా అధ్యక్షురాలి మృతి
తుడుందెబ్బ మొదటి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు కండేల మల్లక్క మంగళవారం మృతి చెందారు. ఎన్నో ఏళ్లుగా ఆదివాసీ అస్తిత్వం కోసం పోరాటం చేసి, ఆదివాసులకు హక్కులు కల్పించడంలో ఆమె ఎంతో కృషి చేశారని ఆదివాసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొప్పుల రవి అన్నారు. మల్లక్క మృతి ఆదివాసీ సమాజానికి తీరని లోటన్నారు. ఆంధ్ర వలసదారులపై పోరాటం చేసి వెయ్యి ఎకరాల భూమిని ప్రజలకు పంచిదన్నారు.
Similar News
News February 4, 2025
ADBలో రేపు 2 జాబ్‌మేళాలు
ADBలోని 1 టౌన్ PS ఎదుటనున్న ప్రభుత్వ ఆర్ట్స్, కామర్స్, శాంతినగర్ సైన్స్ డిగ్రీ కళాశాలలో ఈనెల 5న జాబ్ మేళాలు జరగనున్నాయి. ఆర్ట్స్‌లో అప్ గ్రేడ్ ఆధ్వర్యంలో HDFC, AXIS బ్యాంక్, ముత్తూట్ ఫిన్ కార్ప్ కంపెనీల్లో ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు చేయనున్నారు. సైన్స్‌లో TSKC ఆధ్వర్యంలో TASK సహకారంతో MALE అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. నిరుద్యోగులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
News February 4, 2025
అరసవల్లి: భక్తుల రాకపోకలను పరిశీలించిన కలెక్టర్
అరసవల్లిలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్‌లో ఉన్న సీసీ కెమెరాలు, డ్రోన్‌ల ద్వారా భక్తుల సందర్శన, రాకపోకలను శ్రీకాకుళం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎస్పీ కె.వీ.మహేశ్వర రెడ్డి, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ మంగళవారం పరిశీంచారు. ఇంద్రపుష్కరిణిని పరిశీలించి అక్కడ భవిష్యత్తులో చేయవలసిన ఏర్పాట్లపై చర్చించారు.
News February 4, 2025
ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు బుమ్రా దూరం
ఇంగ్లండ్‌తో జరగబోయే వన్డే సిరీస్‌కు టీమ్ ఇండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా దూరం అయ్యారు. బీసీసీఐ తాజాగా ప్రకటించిన జాబితాలో బుమ్రాకు చోటు దక్కలేదు. ప్రస్తుతం ఆయన NCAలో ఉన్నారు. వెన్నులో వాపు కారణంగా బుమ్రా ఇటీవల క్రికెట్‌కు దూరమయ్యారు. ఈ క్రమంలో ఆయనకు స్కానింగ్ నిర్వహించి అవసరమైతే సర్జరీ చేస్తారని సమాచారం. కాగా బుమ్రా స్థానంలో వరుణ్ చక్రవర్తిని బీసీసీఐ జట్టులోకి తీసుకుంది.