News February 23, 2025
ములుగు: నేడే గురుకుల పరీక్ష.. ఏర్పాట్లు పూర్తి

తెలంగాణలోని వివిధ గురుకుల సొసైటీల కింద ఐదవ తరగతిలో ప్రవేశాల కోసం నిర్వహించే TG-CET-2025 ప్రవేశ పరీక్షకు ములుగు జిల్లాలో ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. ఉ.11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్ష కొనసాగుతుంది. విద్యార్థులు ఉదయం తొమ్మిది గంటల వరకే పరీక్ష సెంటర్లకు చేరుకోవాలని సూచించారు. ఈ ప్రవేశ పరీక్ష ద్వారా 2025-2026 విద్యా సంవత్సరానికి 5వ తరగతిలో ప్రవేశాలు కల్పిస్తారు.
Similar News
News February 23, 2025
జేఈఈ మెయిన్ ఫలితాలు విడుదల

జేఈఈ మెయిన్ పేపర్-2 (BArch&B.Planning) ఫలితాలను NTA విడుదల చేసింది. <
News February 23, 2025
ముగిసిన ఎపీపీఎస్సీ గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలు

ఆదివారం జరిగిన ఎపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ డా.వెంకటేశ్వర్ ఎస్ తెలిపారు. తిరుపతిలో నిర్వహించిన 13 పరీక్షా కేంద్రాలలో ఈ పరీక్షలకు 5801 మంది అభ్యర్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా ఉదయం పేపర్ 1 పరీక్షకు 5055 మంది హాజరు కాగా 87.14 శాతంగా, మధ్యాహ్నం పేపర్-2 పరీక్షకు 5046 మంది హాజరు కాగా 86.99 శాతం మంది పరీక్షకు హాజరయ్యారని తెలిపారు.
News February 23, 2025
కేంద్ర బడ్జెట్ కార్మిక వ్యక్తిరేక బడ్జెట్: సీఐటీయూ

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కార్మిక ప్రజావ్యతిరేక బడ్జెట్ అని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పద్మ శ్రీ అన్నారు. ఆదివారం కార్మిక, వ్యవసాయ సంఘాల ఆధ్వర్యంలో సిద్దిపేటలో సెమినార్ నిర్వాహించారు. ఈసందర్బంగా మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా బడ్జెట్ రూపొందించారని, ఈ విధానాల వలన కార్మికుల, రైతులుకి భారం పడుతుందన్నారు.