News March 19, 2025
ములుగు: పది పరీక్షలు.. కలెక్టర్ కీలక ఆదేశాలు

ములుగు జిల్లాలో 10వ తరగతి వార్షిక పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ దివాకర టిఎస్ అన్నారు. మార్చి 21 నుంచి పరీక్షలు జరగనున్న నేపథ్యంలో నిర్వహణ విద్యాశాఖ సిబ్బందికి కలెక్టర్ ముందస్తు సూచనలు చేశారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు, కేంద్రం వద్ద ఇద్దరు పోలీస్ సిబ్బంది, వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలన్నారు. పరీక్ష పూర్తయ్యే వరకు ఎలాంటి కరెంట్ కోతలు ఉండవద్దన్నారు.
Similar News
News March 20, 2025
నేడు వారికి కారుణ్య ఉద్యోగ నియామక పత్రాలు

TG: స్థానిక సంస్థల్లో కారుణ్య ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న బాధిత కుటుంబాల వారసులకు CM రేవంత్ నేడు నియామక పత్రాలను అందజేయనున్నారు. రవీంద్రభారతిలో జరిగే కార్యక్రమంలో 582 మంది ఈ పత్రాలను అందుకోనున్నారు. జెడ్పీ, మండల పరిషత్తుల్లో ఉన్న 524 ఆఫీసు సబార్డినేట్, నైట్ వాచ్‌మెన్ పోస్టులను జూనియర్ అసిస్టెంట్ పోస్టులుగా అప్ గ్రేడ్ చేశారు. దీంతో పాటు 58 జూనియర్ అసిస్టెంట్ సూపర్ న్యూమరీ పోస్టులను సృష్టించారు.
News March 20, 2025
నేడు కుటుంబసమేతంగా తిరుమలకు సీఎం

AP: ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబ సమేతంగా నేడు తిరుమలకు వెళ్లనున్నారు. రేపు దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఈ నేపథ్యంలో వెంగమాంబ అన్నప్రసాద భవనంలో భక్తులకు అన్నప్రసాద వితరణ చేయనున్నారు. ఇప్పటికే అందుకు సంబంధించి ఒక్కరోజుకు అయ్యే ఖర్చు రూ.44 లక్షలను టీటీడీకి విరాళంగా ఇవ్వనున్నారు. ఏటా దేవాన్ష్ పుట్టినరోజున చంద్రబాబు ఫ్యామిలీ ఇదే పద్ధతి అనుసరిస్తోంది.
News March 20, 2025
తెలంగాణ అప్పులు రూ.5.04 లక్షల కోట్లు

TG: నిన్న బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రి భట్టి విక్రమార్క ఈ ఆర్థిక సంవత్సరం చివరి (మార్చి 2026) నాటికి అప్పుల అంచనా రూ.5,04,814 కోట్లు అని వెల్లడించారు. GSDPలో దీని వాటా 28.1% అని తెలిపారు. 2024-25లో తలసరి ఆదాయం రూ.3,79,751 అని, ఇదే సమయంలో దేశ తలసరి ఆదాయం రూ.2,05,579గా ఉందని పేర్కొన్నారు.