News February 12, 2025

ములుగు: పోస్టల్లో ఉద్యోగ అవకాశాలు

image

ఇండియన్ పోస్ట్ 21,413 జీడీఎస్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. వరంగల్ డివిజన్ పరిధిలో 29 ఖాళీలున్నాయి. దీనికి పదవ తరగతి అర్హులు కాగా.. కంప్యూటర్ నాలెడ్జ్ తప్పనిసరి. వయసు 18-40 ఏళ్ల మధ్య ఉండాలి. మెరిట్ ఆధారం రిక్రూట్‌మెంట్ చేపడతారు. దరఖాస్తు ఫీజు జనరల్, ఓబీసీ, ఈడబ్లూఎస్ వారికి రూ.100 కాగా మిగితా వారికి ఉచితం. మార్చి 3 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

Similar News

News February 12, 2025

తూ.గో: వండిన చికెన్‌నే తినాలి

image

తూ.గో జిల్లా పెరవలి మండలంలో కోళ్లకు బర్డ్ ఫ్లూ నిర్ధారణ వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో చికెన్ తినేందుకు ప్రజలు భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో వండిన చికెన్ మాత్రమే తినాలని వైద్యులు సూచిస్తున్నారు. 75 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వరకూ ఉడకపెట్టాలన్నారు. చికెన్, గుడ్లు చేతితో తాకితే శుభ్రంగా కడుక్కోవాలని సూచిస్తున్నారు. ఎవరికైనా జ్వరం, తలపోటు, జలుబు లక్షణాలు వస్తే వైద్య సిబ్బందికి సమాచారం అందిచాలన్నారు.

News February 12, 2025

నేరాల నియంత్రణకై ముమ్మర పెట్రోలింగ్ చేపట్టాలి: మామునూర్ ఏసీపీ

image

మామూనూర్ డివిజన్ పరిధిలో నేరాలు నియంత్రించేందుకు పోలీస్ స్టేషన్ల పరిధిలో అధికారులు, సిబ్బంది ముమ్మరంగా పెట్రోలింగ్ చేపట్టాలని ఏసీపీ తిరుపతి అధికారులకు సూచించారు. డివిజన్‌కు చెందిన పోలీస్ అధికారులతో మామూనూర్ ఏసీపీ నేర సమీక్ష నిర్వహించారు. ప్రధానంగా పెండింగ్ కేసులను పరిష్కరించడంలో అధికారులు చొరవ తీసుకోవాలని భాదితులకు న్యాయం చేయాలని ఏసీపీ అధికారులకు తెలిపారు.

News February 12, 2025

ఏలూరులో వ్యభిచారం.. పోలీసుల అదుపులో నిందితులు

image

ఏలూరులో మసాజ్ సెంటర్లపై టూటౌన్ సీఐ రమణ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. ఏలూరు ఫైర్ స్టేషన్ సమీపంలోని ఓవర్ బ్రిడ్జి కింద ఉన్న ఎస్ఎస్ కాల్ సెంటర్లో బ్యూటీపార్లర్ ట్రైనింగ్ కోర్సు పేరుతో యువతులతో వ్యభిచారం చేయిస్తున్నారని పలువురు ఆరోపించినట్లు తెలిపారు. దీంతో పోలీసులు దాడి చేసి కాల్ సెంటర్ నిర్వాహకుడు నాగార్జున, మరికొందరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.

error: Content is protected !!