News March 6, 2025
ములుగు: మావోయిస్టు కొరియర్ల వివివరాలు

వెంకటాపురం మండలం కొత్తపల్లి క్రాస్ వద్ద నలుగురు మావోయిస్టు కొరియర్లను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఏటూరునాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. బాడిసే అనిల్, కుర్హమి భామన్, మాడవి సుక్కు, సోడి ఇడుమల@చారి వీరంతా ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాకు చెందినవారన్నారు. మావోయిస్టు పార్టీకి దుస్తులు, ఎలక్ట్రానిక్ వస్తువులు, బూట్లు అందజేస్తున్నట్లు విచారణలో వెల్లడైందన్నారు.
Similar News
News March 6, 2025
ఏపీలో ‘ఛావా’ సినిమాపై వివాదం

‘ఛావా’ సినిమాను ఏపీలో రిలీజ్ చేయొద్దని ముస్లిం ఫెడరేషన్ ఆఫ్ ఏపీ ప్రెసిడెంట్ మహ్మద్ జియా ఉల్ హక్ డిమాండ్ చేశారు. ఈ మూవీలో చరిత్రను వక్రీకరించారని, రిలీజ్‌ను ఆపాలని నెల్లూరు జిల్లా కలెక్టర్‌కు మెమోరాండం ఇచ్చారు. ఇందులో ముస్లింలను తప్పుగా చూపారని ఆయన ఆరోపించారు. మరాఠా యోధుడు శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా తెలుగు వెర్షన్ రేపు థియేటర్లలో రిలీజ్ కానుంది.
News March 6, 2025
ఓటమి మరింత బాధ్యతను పెంచింది: నరేందర్ రెడ్డి

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి తనకు మరింత బాధ్యతను పెంచిందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి అన్నారు. గురువారం ఎమ్మెల్సీ క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టెక్నికల్‌గా తాను ఓడిపోయినప్పటికీ నైతిక విజయం మాత్రం తనదేనని, పట్టభద్రులంతా తనకు అండగా నిలిచి ఓట్లు వేశారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి వెల్లడించారు.
News March 6, 2025
శ్రీ సత్యసాయి జిల్లాలో 551మంది గైర్హాజరు

శ్రీ సత్యసాయి జిల్లా వ్యాప్తంగా 42 పరీక్ష కేంద్రాల్లో ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులకు నేడు పార్ట్-3లోని పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలకు జనరల్ విద్యార్థులలో 12,437 మందికి గానూ 11,985 మంది, ఒకేషనల్ విద్యార్థుల్లో 1,644 మందికి గానూ 1,545 మంది హాజరయ్యారు. మొత్తం 551 గైర్హాజరైనట్లు డీఐఈఓ రఘునాథ రెడ్డి తెలిపారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగాయన్నారు.