News January 22, 2025

ములుగు: మైనారిటీ అభ్యర్థుల నుంచి దరఖాస్తుల ఆహ్వానం

image

ములుగు జిల్లాలోని మైనారిటీ నిరుద్యోగ అభ్యర్థుల నుంచి గ్రూప్- 1,2,3,4, రైల్వే బ్యాంకింగ్ పోటీ పరీక్షలకు సంబంధించి 4 నెలల ఫౌండేషన్ కోర్స్ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి రవీందర్ రెడ్డి తెలిపారు. అర్హులైన మైనారిటీ నిరుద్యోగ అభ్యర్థులు ఫిబ్రవరి 15లోగా జిల్లా కేంద్రంలోని సంక్షేమ భవన్లో గల రూమ్ నంబర్ 6లో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు.

Similar News

News March 14, 2025

అత్యుత్తమ ప్రాంతాల జాబితాలో రెండు భారత హోటళ్లు

image

టైమ్ మ్యాగజైన్ తాజాగా విడుదల చేసిన ‘ప్రపంచంలోని అత్యుత్తమ ప్రాంతాలు’ జాబితాలో భారత్‌ నుంచి జైపూర్‌ రాఫిల్స్, బాంధవ్‌గఢ్‌లోని ఒబెరాయ్ వింధ్యావిలాస్ వైల్డ్‌లైఫ్ రిసార్ట్స్ చోటు దక్కించుకున్నాయి. ఈ రెండూ అద్భుతమైన ప్రాంతాలని చెప్పిన టైమ్, ముంబైలోని పాపాస్ రెస్టారెంట్‌ను చూడాల్సిన చోటుగా పేర్కొంది. ఈ జాబితాలో మ్యూజియాలు, పార్కులు, పర్యాటక ప్రదేశాలు తదితర ప్రాంతాలను టైమ్ పరిగణించింది.

News March 14, 2025

OTTలోకి వచ్చేసిన కంగనా ‘ఎమర్జెన్సీ’

image

కంగనా రనౌత్ స్వీయ దర్శకత్వంలో నటించి నిర్మించిన ‘ఎమర్జెన్సీ’ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి వచ్చింది. మార్చి 17 నుంచి స్ట్రీమింగ్ కావాల్సి ఉండగా, 3 రోజుల ముందే రిలీజ్ చేశారు. ఇందులో కంగనా మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్రను పోషించారు. ఈ సినిమాతో పాటు రాషా తడానీ, అజయ్ దేవ్‌గణ్ నటించిన ‘ఆజాద్’ కూడా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

News March 14, 2025

NZB: తల్లిని హత్య చేసిన కూతురు

image

నిజామాబాద్ నగరంలోని నాగారం 300 క్వార్టర్స్‌ దారుణం చోటుచేసుకుంది. ఓ కూతురు తన భర్తతో కలిసి కన్న తల్లిని హత్య చేసింది. స్థానికుల కథనం ప్రకారం.. బీడీ వర్కర్స్ కాలనీకి చెందిన విజయ(60) భర్త చనిపోగా కూతురు సౌందర్య, అల్లుడితో కలిసి ఉంటోంది. శుక్రవారం తన తల్లికి గుండెపోటు వచ్చి చనిపోయిందని సౌందర్య నమ్మించే ప్రయత్నం చేయగా విజయ గొంతుపై గాయాలు ఉండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

error: Content is protected !!