News February 6, 2025

ములుగు: రైతు భరోసా డబ్బులు జమ!

image

ములుగు జిల్లా వ్యాప్తంగా రైతుల ఖాతాలో రైతు భరోసా నిధులు జమవుతున్నాయి. బుధవారం మధ్యాహ్నం నుంచి అర్ధరాత్రి వరకు ఎకరం లోపు విస్తీర్ణం కలిగిన రైతుల ఖాతాలో రైతు భరోసా నిధులు జమ అయినట్లు రైతులు తెలిపారు. ఎకరం విస్తీర్ణానికి పైగా ఉన్న రైతులకు కూడా ఒకటి, రెండు రోజుల్లో భరోసా నిధులు జమవుతాయని ప్రభుత్వం వెల్లడించింది.

Similar News

News February 6, 2025

SV అగ్రికల్చర్ వర్సిటీకి బాంబు బెదిరింపు

image

తిరుపతి SV అగ్రికల్చర్ యూనివర్సిటీకి బాంబు బెదిరింపు వచ్చిందని కళాశాల సిబ్బంది తెలిపారు. హ్యూమన్ ఐఈడీ బాంబుతో పేల్చేస్తామంటూ గురువారం ఉదయం కళాశాలకు మెయిల్ వచ్చిందన్నారు. కేరళ నుంచి ఈ మెయిల్ వచ్చినట్టు వారు చెబుతున్నారు. కళాశాల అధికారుల ఫిర్యాదు మేరకు.. తిరుపతి ఎస్పీ సూచనలతో సీఐ చినగోవిందు వర్సిటీలో తనిఖీలు చేపట్టారు. 

News February 6, 2025

పార్టీ నిర్ణయాలను వ్యతిరేకిస్తే కఠిన చర్యలు: CLP

image

TG: పార్టీ విధానాలను సొంత పార్టీ నేతలే తప్పుపడుతుండటంపై కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ (CLP) మీటింగ్‌లో నేతలు చర్చలు జరిపారు. పార్టీ నిర్ణయాలను వ్యతిరేకించే వారిపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించారు. సొంత పార్టీ నేతలే విమర్శలు చేస్తుంటే ప్రజల్లోకి చెడు సంకేతాలు వెళ్తాయని, ఏవైనా విభేదాలుంటే అంతర్గతంగా చర్చించుకోవాలని సీఎం రేవంత్ ఆదేశించినట్లు సమాచారం.

News February 6, 2025

WNP: మహిళలు, బాలికల భద్రతకు భరోసా కేంద్రం పెద్దపీట: ఎస్పీ

image

మహిళల, బాలికల భద్రతకు భరోసా కేంద్రం పెద్దపీట వేస్తుందని జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భరోసా కేంద్రం ప్రథమ వార్షికోత్సవ కార్యక్రమంలో కలెక్టర్ ఆదర్శ్ సురభితో కలిసి ఎస్పీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. భరోసా కేంద్రం ద్వారా మహిళలకు రక్షణ కల్పించడంతోపాటు వారికి అవసరమైన న్యాయం కల్పించడం జరుగుతుందని తెలిపారు.

error: Content is protected !!