News April 5, 2025

ములుగు వాసులూ.. APPLY చేశారా..?

image

నిరుద్యోగుల కోసం రాజీవ్ యువవికాసం పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే దరఖాస్తుల స్వీకరణకు ఈనెల 14 వరకు గడువుంది. జూన్ 2 నుంచి 9 వరకు అర్హులకు మంజూరు పత్రాలు ఇస్తారు. లబ్ధిపొందిన వారికి నెల వరకు శిక్షణ ఇవ్వనున్నారు. ఆధార్, రేషన్ కార్డ్, క్యాస్ట్ & ఇన్‌కమ్ సర్టిఫికెట్స్‌తో ఆన్‌లైన్‌లో అప్లై చేసి హార్డ్ కాపీలను ములుగు జిల్లాలోని మీ MPDO ఆఫీస్‌లో ఇవ్వాలి. SHARE

Similar News

News April 6, 2025

భద్రాచలానికి సీఎం రాక.. భారీ బందోబస్తు

image

భద్రాచలానికి సీఎం రేవంత్ రానున్న నేపథ్యంలో బూర్గంపాడు మండలం సారపాకలోని ఐటీసీ హెలిపాడ్ గ్రౌండ్ వద్ద అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సుమారు 2000 మంది పోలీస్ సిబ్బందితో పకడ్బందీ చర్యలు చేపట్టారు. ఉదయం 10.45 గంటలకు భద్రాద్రి ఆలయానికి సీఎం రానున్నారు.

News April 6, 2025

కరీంనగర్: బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం నిషేధం

image

KNR కమిషనరేట్ పరిధిలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం, DJ సౌండ్‌ల వినియోగంపై అమల్లో ఉన్న నిషేధాజ్ఞలను ఈనెల30 వరకు పొడగించామని CP గౌస్ ఆలం ఒక ప్రకటనలో తెలిపారు. నిషేధాజ్ఞలు ఉల్లంఘించిన వారిపై కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని, కార్యక్రమాల నిర్వహణకు మైక్‌సెట్ వినియోగం తప్పనిసరైతే స్థానిక ACP అనుమతి పొందాలన్నారు.

News April 6, 2025

ఆకివీడులో రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

image

ఆకివీడు జిల్లా పరిషత్ హైస్కూల్ వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో రెండు బైకులు ఢీకొన్న ఘటనలో ఓ మృతి చెందాడు. ఆకివీడు పెదపేటకు చెందిన మేకల మైకేల్ రాజ్ (40) రహదారి దాటుతుండగా ఎదురుగా వచ్చిన బైక్ ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించినట్లు స్థానికులు చెప్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించి దర్యాప్తు చేస్తున్నట్లు ఆకివీడు ఎస్ఐ హనుమంతు నాగరాజు తెలిపారు. కాగా మైకేల్‌కు భార్య, ఇద్దరు పిల్లలున్నారు.

error: Content is protected !!