News February 12, 2025

ములుగు: స్థానిక ఎన్నికలకు సిద్ధమవుతున్న అధికారులు

image

ములుగు జిల్లాలో త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు రానున్నాయన్న సంకేతాలతో అధికారులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో మూడు మండలాల చొప్పున గ్రామపంచాయతీ ఎన్నికలకు రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు ట్రైనింగ్ నిర్వహిస్తున్నట్లు సమాచారం. నోటిఫికేషన్ విడుదలైన వెంటనే ఎన్నికలకు సంబంధించిన పూర్తి ఏర్పాట్లు చేసేలా సమాయత్తం అవుతున్నారు.

Similar News

News February 12, 2025

వికారాబాద్: ఆలయంలో హారతి లేదు.. అర్చన లేదు

image

వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఓల్డ్ ఎల్ఐసీ కాలనీలోని డాక్టర్ బీ.ఆర్ అంబేడ్కర్ ఆలయ ప్రాంగణంలోని శ్రీనాగదేవత మందిరంలో హారతి లేదు అర్చన లేదు పూజా లేవు. 2012 సంవత్సరంలో ప్రారంభించిన ఈ ఆలయంలో గత 12ఏళ్లుగా కొనసాగుతుంది. మాజీ కౌన్సిలర్ భరాడి రమేష్ ఈ ఆలయాన్ని నిర్మించారు. ఆలయ ప్రారంభ కార్యక్రమానికి చిన్న జీయర్ స్వామితో పాటు పలువురు ఆధ్యాత్మికవేత్తలు పాల్గొన్నారు. హారతి, అర్చన పూజారీలేని ఆలయం ఇదే. 

News February 12, 2025

BREAKING: అకౌంట్లో డబ్బుల జమ

image

TG: రైతులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 3 ఎకరాల వరకు సాగులో ఉన్న భూములకు ఎకరానికి రూ.6వేల చొప్పున రైతు భరోసా నిధులు జమ చేసినట్లు తెలిపింది. జనవరి 26న ఈ పథకం కింద ప్రభుత్వం నిధుల జమను ప్రారంభించింది. ఫిబ్రవరి 5న 17.03 లక్షల మందికి, ఫిబ్రవరి 10న 8.65 లక్షల మందికి విడతల వారీగా నిధులు జమ చేసిన సంగతి తెలిసిందే.

News February 12, 2025

విజయవాడ: రెండు రోజులు ఆ రైలు రద్దు

image

గూడూరు- విజయవాడ మధ్య మూడవ రైల్వే లైన్ నిర్మాణ పనులు జరుగుతున్నందున విజయవాడ- తెనాలి మధ్య ప్రయాణించే మెము రైలును రద్దు చేశామని రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు నం.67221 విజయవాడ- తెనాలి మెము రైలును బుధ, గురువారాలు రద్దు చేశామన్నారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని రైల్వే అధికారులు తాజాగా ఓ ప్రకటన విడుదల చేశారు.

error: Content is protected !!