News April 8, 2025

ముస్తాబాద్: 240 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు: కలెక్టర్

image

సిరిసిల్ల జిల్లాలో మహిళా సంఘాల ద్వారా 191 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్‌ ఝా తెలిపారు. ముస్తాబాద్ మండలం గూడెం, నామాపూర్, పోతుగల్‌లో ఏర్పాటు చేసిన ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంగళవారం ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 3 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలు లక్ష్యంతో మొత్తం జిల్లాలో 240 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని ఆయన పేర్కొన్నారు.

Similar News

News April 19, 2025

మాడుగుల: భార్య పుట్టింటికి వెళ్లిపోయిందని భర్త ఆత్మహత్య

image

మాడుగుల మండలం జాలంపల్లిలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. మాడుగుల ఎస్ఐ నారాయణరావు వివరాల ప్రకారం జాలంపల్లికి చెందిన పినబోయిన లోవ (38) లక్ష్మి భార్యాభర్తలు. వీరిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో లక్ష్మి కొద్ది రోజుల క్రితం పుట్టింటికి వెళ్లిపోయింది. ఆమె తిరిగి రాలేదన్న మనస్థాపంతో మద్యానికి బానిసైన లోవ శుక్రవారం సాయంత్రం పాకలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్‌ఐ నారాయణ కేసు నమోదు చేశారు.

News April 19, 2025

ప్రవీణ్ శరీరంపై 18 గాయాలున్నాయి: హర్షకుమార్

image

పాస్టర్ ప్రవీణ్ పగడాల కేసులో పోస్టుమార్టం రిపోర్టు బహిర్గతం చేయడానికి ప్రభుత్వం ఎందుకు జాప్యం చేస్తోందని మాజీ ఎంపీ జీవీ హర్ష కుమార్ నిలదీశారు.శుక్రవారం రాజమండ్రిలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రవీణ్ కేసులో పోలీసుల దర్యాప్తును తనతో సహా ఎవ్వరూ విశ్వసించడం లేదని వ్యాఖ్యానించారు. తన వద్దకు వచ్చిన పోస్టుమార్టం రిపోర్ట్ ప్రకారం ప్రవీణ్‌పై 18 శరీరంపై గాయాలున్నాయని, ఇది ముమ్మాటికీ హత్యే అని పేర్కొన్నారు.

News April 19, 2025

ఈనెల 23 నుంచి JEE అడ్వాన్స్‌డ్ రిజిస్ట్రేషన్

image

జేఈఈ మెయిన్‌లో అర్హత సాధించిన అభ్యర్థులకు జేఈఈ అడ్వాన్స్‌డ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈనెల 23న ప్రారంభం కానుంది. మే 2 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. తొలుత <<16144953>>మెయిన్‌లో<<>> సాధించిన మార్కుల ఆధారంగా ర్యాంకులు కేటాయిస్తారు. ఆ తర్వాత ర్యాంకులు, రిజర్వేషన్ల ఆధారంగా మొత్తం 2.50 లక్షల మందికి అడ్వాన్స్‌డ్ పరీక్ష రాసేందుకు అవకాశం కల్పిస్తారు. ఈ పరీక్ష మే 18న జరగనుంది. జూన్ 2న ఫలితాలు వెలువడుతాయి.

error: Content is protected !!