News March 30, 2025

ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన BHPL కలెక్టర్

image

ముస్లిం ప్రజలకు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియచేస్తూ ఆదివారం ఒక ప్రకటన జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రంజాన్ పవిత్రమైన నెలగా, త్యాగం, భక్తి, సహనం, మానవతా విలువల ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. ఉపవాస దీక్ష, ప్రార్థనలు, దానం వంటి ఆచారాలు సామాజిక సమగ్రతను పెంపొందిస్తాయని, అందరూ కలిసికట్టుగా సమాజంలో శాంతి, ఐక్యతను చాటాలని పిలుపునిచ్చారు.

Similar News

News April 2, 2025

రోడ్డు ప్రమాద బాధితులకు పరిహారం: విశాఖ సీపీ

image

విశాఖ సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రోడ్డు ప్రమాద బాధితుల సహాయక కేంద్రం ద్వారా ప్రమాద బాధితులకు బుధవారం లక్ష రూపాయలు పరిహారం అందజేసినట్లు సీపీ శంఖబ్రత బాగ్చి తెలిపారు. ఇటీవల హిట్ రన్‌లో తీవ్ర గాయాలపాలైన మొండెం రామక్రిష్ణ, జన సన్యాసప్పాడుకు ఒక్కొక్కరికి రూ.50 వేల చొప్పున వారి బ్యాంకు ఖాతాల్లోకి జమ చేశారు. ఇప్పటివరకు ఈ కేంద్రం ద్వారా 32 మందికి రూ.26,50,000 ఇచ్చినట్లు తెలిపారు.

News April 2, 2025

అనంత: ఆర్థికంగా వెనుకబడిన పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం

image

అనంత ఆణిముత్యాలు ఎడ్యుకేషనల్ అండ్ డెవలప్‌మెంట్ సొసైటీ కింద ఆర్థికంగా వెనుకబడిన పేద విద్యార్థులకు సహాయం అందించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి, ఐ.ఏ.ఎస్ ఆదేశించారు. బుధవారం సాయంత్రం అనంతపురం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో “అనంత ఆణిముత్యాలు” ఎడ్యుకేషనల్ అండ్ డెవలప్మెంట్ సొసైటీపై సం.శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.

News April 2, 2025

అల్లూరి జిల్లాలో టుడే టాప్ న్యూస్

image

> వేసవిలో చిన్నారుల సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి
> స్పాట్ వేల్యుయేషన్‌కు 683మంది: అల్లూరి డీఈవో 
> పాడేరు: నోటిఫికేషన్ రద్దు చేయాలని డిమాండ్
> గంగవరం: జీడిపిక్కల కొనుగోలు ప్రారంభం
> కిలో జీడి పిక్కలు రూ.150కు కొనుగోలు..ఎమ్మెల్యే శిరీష
> అరకులో అక్రమ నిర్మాణాలు: ఆదివాసీ గిరిజన సంఘం
> పెదబయలు, ముంచంగిపుట్టు మండలాల్లో భారీ వర్షం

error: Content is protected !!