News March 29, 2025

మెట్పల్లి మార్కెట్లో పసుపు ధరలు..

image

మెట్పల్లి వ్యవసాయ మార్కెట్‌లో నేటి పసుపు ధరలు ఇలా ఉన్నాయి. పసుపు కాడి క్వింటాల్ గరిష్ఠ ధర రూ. 12,566, కనిష్ఠ ధర రూ. 9,211, పసుపు గోళ గరిష్ఠ ధర రూ. 11,888, కనిష్ఠ ధర రూ. 9,051, పసుపు చూర గరిష్ఠ ధర రూ. 9,452, కనిష్ఠ ధర రూ. 8,183లుగా పలికాయి. కాగా ఈ సీజన్లో మొత్తం కొనుగోళ్ళు 36,557 క్వింటాళ్లు కాగా, ఈ రోజు 325 క్వింటాళ్ల కొనుగోళ్ళు జరిగాయి. 

Similar News

News April 2, 2025

వీరఘట్టం: ఎండ తీవ్రతకు వృద్ధురాలి మృతి

image

వీరఘట్టం మండల కేంద్రంలోని ముచ్చర్ల వీధికి చెందిన మంతిని గౌరమ్మ (85) మంగళవారం మృతి చెందింది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న గౌరమ్మ ఎండ తీవ్రతను తాళలేక మరణించిందని స్థానికులు తెలిపారు. అయితే ఉదయం పెన్షన్ తీసుకున్న కొద్దిసేపటికి మృతి చెందింది. చుట్టాలు, బంధువులు ఎవరు లేకపోవడంతో వీధిలో ఉన్న వారంతా వచ్చి ఆమెకు అంత్యక్రియలు నిర్వహించారు.

News April 2, 2025

SBI అకౌంట్ నుంచి డబ్బులు కట్ అయ్యాయా?

image

నిన్న ఎస్బీఐ సేవల్లో <<15956785>>అంతరాయంతో<<>> కస్టమర్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉ.8.15 నుంచే ఇంటర్నెట్ బ్యాంకింగ్, యోనో లైట్, యూపీఐ సేవల్లో సమస్యలు ఎదురయ్యాయి. తమ అకౌంట్ల నుంచి డబ్బులు కట్ అయ్యాయని, ట్రాన్సాక్షన్లు ఫెయిల్ అయ్యాయని కస్టమర్లు ఫిర్యాదులు చేస్తున్నారు. ఇంకా డబ్బులు క్రెడిట్ కాలేదని, వెంటనే తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై SBI ఇంకా స్పందించలేదు. మీకూ ఇలాంటి సమస్య ఎదురైందా?

News April 2, 2025

రాజమండ్రి: కోర్టు సంచలన తీర్పు

image

మైనర్ కుమార్తెపై అత్యాచారం కేసులో నేరం రుజువు కావడంతో న్యాయ స్థానం నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్షను విధించినట్లు చాగల్లు ఎస్సై కె. నరేంద్ర తెలిపారు. ఆయన వివరాల ప్రకారం..చాగల్లు మండలంలో 2020లో తన మైనర్ కుమార్తెపై ఆమె తండ్రి అత్యాచారం చేయగా గర్భం దాల్చింది. అప్పటి డీఎస్పీ రాజేశ్వరి అరెస్ట్ చేశారు. కేసులో న్యాయస్థానం తండ్రికి యావజ్జీవ శిక్ష, రూ.5 వేలు జరిమానా విధిస్తూ మంగళవారం తీర్పునిచ్చింది.

error: Content is protected !!