News April 3, 2025
మెట్‌పల్లి వ్యవసాయ మార్కెట్‌లో పసుపు ధర ఇలా

జగిత్యాల జిల్లా మెట్పల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో గురువారం పసుపు ధర ఈవిధంగా ఉన్నాయి. ఈరోజు పసుపు కాడి గరిష్ఠ ధర రూ.14,395, కనిష్ఠ ధర రూ.9,009, పసుపు గోళం గరిష్ఠ ధర రూ.13,556, కనిష్ఠ ధర రూ.8,888 పసుపు చూర గరిష్ఠ ధర రూ.10,445, కనిష్ఠ ధర రూ.9,292గా పలికిందని కార్యదర్శి తెలిపారు. ఈరోజు మొత్తం 1783 క్వింటాళ్ల పసుపు కొనుగోళ్లు జరిగాయని ఆయన పేర్కొన్నారు.
Similar News
News April 11, 2025
నిర్మల్ జిల్లాలో యాక్సిడెంట్.. వ్యక్తి మృతి

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన గురువారం భైంసా మండలంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. భైంసా పట్టణం గోపాల్‌నగర్‌కు చెందిన బోయిడోళ్ల రాజు (32) వానల్పాడ్ నుంచి నడుచుకుంటూ తిమ్మాపూర్ వైపు వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీ కొంది. తలకు బలమైన గాయాలై అక్కడికక్కడే మృతి చెందారు. కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
News April 11, 2025
ప్రపంచ దేశాల సుందరీమణుల పర్యటనకు సిద్ధం చేయాలి: కలెక్టర్

మే 14న హైదరాబాద్ నుంచి ప్రపంచ సుందరి పోటీల్లో పాల్గొనే వివిధ దేశాలకు చెందిన సుందరగిరిలో వరంగల్ పర్యటనలో భాగంగా కాళోజీ కళాక్షేత్రం సందర్శించనున్నారని, అందుకు సంబంధించిన ఏర్పాట్లు సిద్ధం చేయాలని కలెక్టర్ ప్రావీణ్య అధికారాలను ఆదేశించారు. రెవెన్యూ, పర్యాటక, ఇతర శాఖల అధికారులతో సమన్యాయ సమావేశం నిర్వహించారు. చరిత్ర గల వరంగల్‌ను ప్రపంచ దేశాల సుందరగిరిలో సందర్శించేందుకు దక్కిన అరుదైన గౌరవం అని తెలిపారు.
News April 11, 2025
KMR: పోలీస్ స్టేషన్ రైటర్లకు ఎస్పీ దిశానిర్దేశం..

కామారెడ్డి జిల్లాలోని పోలీస్ స్టేషన్లలో పనిచేస్తున్న రైటర్లతో జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర జిల్లా పోలీసు కార్యాలయంలో గురువారం సమావేశం అయ్యారు. నూతనంగా అమల్లోకి వచ్చిన చట్టాల్లోని ముఖ్యమైన అంశాలను ఎస్పీ వివరించారు. పోలీస్ స్టేషన్ రైటర్లు కేసుల నమోదు, దర్యాప్తు ప్రక్రియలో కీలక పాత్ర పోషిస్తారని అన్నారు. కొత్త చట్టాలపై సరైన అవగాహన ఉంటేనే వారు సమర్థవంతంగా విధులు నిర్వర్తించగలరని స్పష్టం చేశారు.