News December 1, 2024

మెట్రో రైలు ట్రాఫిక్ కంట్రోలర్‌గా రేగోడ్ వాసి

image

మెట్రో లోకో పైలట్ స్థాయి నుంచి మెట్రో ట్రైన్స్‌ను నియంత్రించే స్థాయికి ఎదిగాడు మెదక్ జిల్లా యువకుడు. రేగోడ్‌కు చెందిన బోయిని వీరప్రసాద్ 2017లో ప్రారంభమైన HYD మెట్రోలో భాగంగా నాగోల్ నుంచి అమీర్‌పేట వరకు తొలి ప్యాసింజర్ మెట్రో నడిపారు. గతంలో మెట్రో లోకోపైలట్, మెట్రో డిపో కంట్రోలర్‌గా పనిచేసి నేడు మెట్రో ట్రాఫిక్ కంట్రోలర్ అధికారి అయ్యారు. దీంతో వీర ప్రసాద్‌ను గ్రామస్థులు, మిత్రులు అభినందిస్తున్నారు.

Similar News

News March 12, 2025

తెలంగాణ బడ్జెట్.. ‘అధ్యక్షా.. మెదక్ జిల్లాపై దృష్టి పెట్టండి’

image

అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. మెదక్ జిల్లాలో అనేక పెండింగ్ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ప్రజలు ఎదురుచూస్తున్నారు. ప్రధానంగా మంబోజిపల్లి చక్కెర కర్మాగారం పునరుద్ధరించాలి. వనదుర్గ ప్రాజెక్ట్ ఎత్తు పెంపు, కాలువల సిమెంట్ లైనింగ్ పూర్తితో పాటు కాళేశ్వరం కాలువలు పూర్తి చేయాల్సి ఉంది. గత ప్రభుత్వంలో ప్రారంభించిన రామాయంపేట రెవెన్యూ డివిజన్‌లో అధికారిక కార్యక్రమాలు కొనసాగేలా చూడాలి.

News March 12, 2025

మెదక్ జిల్లాలో పోలీస్ హోంగార్డు మృతి

image

మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నాగ్సాన్‌పల్లి గ్రామానికి చెందిన పోలీస్ హోంగార్డ్ తలారి మహేందర్(39) మంగళవారం రాత్రి మృతిచెందారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. సోమవారం ఉదయం గుండెపోటు రావడంతో మెదక్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతిచెందారు. దీంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగారు. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుడికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. 

News March 12, 2025

మెదక్: మాతా శిశు మరణాల నియంత్రణే లక్ష్యంగా పనిచేయాలి: కలెక్టర్

image

జిల్లాలో మాతా శిశు మరణాల నియంత్రణే లక్ష్యంగా ఏఎన్ఎంలు పనిచేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. మంగళవారం మెదక్ జిల్లా కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్ నందు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఏఎన్ఎంలతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. జిల్లాలో మాతా శిశు మరణాల నియంత్రణపై ప్రత్యేక చర్యలు తీసుకొంటున్నామని తెలిపారు. గర్భం దాల్చిన మహిళలు పీహెచ్‌సీ, ప్రభుత్వ ఆసుపత్రులలో వివరాలు నమోదు చేసుకోవాలన్నారు.

error: Content is protected !!