News March 23, 2025
మెదక్: ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి అదృశ్యం

ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి అదృశ్యమైన ఘటన నర్సాపూర్ మండలంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాలు.. సునీత లక్ష్మారెడ్డి కాలనీలో నివాసం ఉండే సిరివెన్నెల అనే వివాహిత ఈనెల 20న హైదరాబాద్ ఆస్పత్రికి వెళ్లి తిరిగి రాలేదు. భర్త భూపతి బంధువుల ఇంట్లో వెతికిన ఆచూకీ లభించలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News March 26, 2025
MDK: హామీలను అమలు చేసే వరకు వదిలే ప్రసక్తే లేదు: హరీశ్ రావు

కాంగ్రెస్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు వదిలే ప్రసక్తే లేదని ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. మంగళవారం మెదక్‌లో మాట్లాడుతూ.. రుణమాఫీ చేసిందని ప్రభుత్వం అబద్ధాలు చెప్తోందని, రుణమాఫీ కాని రైతులు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను నిలదీయాలని తెలిపారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే పోలీసు కేసులు పెట్టి గొంతునొక్కే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలకు అండగా బీఆర్ఎస్ ఉంటుందన్నారు.
News March 26, 2025
సంగారెడ్డి: మహిళపై అత్యాచారం

సంగారెడ్డి జిల్లాలో ఓ మహిళ(30)పై <<15883970>>అత్యాచారం<<>> జరిగిన విషయం తెలిసిందే. పటాన్ చెరు(M) కంజర్లకు చెందిన దంపతులు సదాశివపేటకు వెళ్లి ఆటోలో ఇంటికి వస్తున్నారు. ఈ క్రమంలో మామిడిపల్లి చౌరస్తా వద్ద ఆటో ఆపి భర్త మూత్ర విసర్జనకు వెళ్లాడు. ఈ క్రమంలో ఇద్దరు వ్యక్తులు మహిళపై అత్యాచారానికి పాల్పడినట్లు సమాచారం. అడ్డొచ్చిన భర్తపై దాడి చేసినట్లు తెలిసింది. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగుచూసింది.
News March 26, 2025
MDK: జిల్లాకు మంత్రి పదవి దక్కేనా.!

ఎన్నో నెలలుగా ఊరిస్తున్న మంత్రివర్గ విస్తరణ ఉగాదిలోపు చేపట్టాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. క్యాబినెట్ విస్తరణపై ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ఖర్గేతో సీఎం రేవంత్ సుదీర్ఘంగా చర్చించారు. మంత్రి వర్గంలోకి 4 లేక ఐదుగురిని తీసుకునే అవకాశం ఉంది. ఇందులో ఉమ్మడి MDK జిల్లా నాయకురాలు, ఎమ్మెల్సీ విజయశాంతికి మంత్రి పదవిని ఇవ్వాలని అధిష్టానం భావిస్తోన్నట్లు సమాచారం. మరి మీ కామెంట్..