News April 26, 2024
మెదక్: ఊపందుకున్న ప్రచారం..
పార్లమెంట్ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. నామినేషన్ ఘట్టం ముగియడంతో పార్టీల అభ్యర్థులు ప్రచారంపై దృష్టిసారించి గెలుపుకు వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. మెదక్ లో ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య నువ్వా నేనా అన్నట్టు పోటీ నెలకొంది. ద్విచక్ర వాహన ర్యాలీలు, ఇంటింటి ప్రచారం, సభలు నిర్వహిస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అమిత్ షా, రేవంత్ రెడ్డి, కేసీఆర్ ప్రచారం చేశారు.
Similar News
News November 27, 2024
మెదక్: RTCలో ఉద్యోగాలు
మాజీ సైనికులను ఆర్టీసీ డ్రైవర్లుగా నియమించాలని రాష్ట్ర ఆర్టీసీ, సైనిక సంక్షేమ శాఖలు నిర్ణయించాయి. మెదక్ రీజియన్లో 81 పోస్టులను కాంట్రాక్టు విధానంలో రిటైర్డ్ సైనికులతో భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశాయి. అర్హులైనవారు ఈ నెల 30 వరకు ప్రాంతీయ సైనిక సంక్షేమ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించాయి. ఎంపికైన వారికి నెలకు రూ.26వేల జీతంతో పాటు రోజుకు రూ.150 చొప్పున అలవెన్స్ రూపంలో ఇవ్వనున్నారు.
SHARE IT
News November 26, 2024
నమ్మకంతో ఎన్నికల్లో చురుకుగా పాల్గొనాలి: కలెక్టర్ రాహుల్ రాజ్
ఓటర్లందరూ ఎన్నికల ప్రక్రియ, భారత ఎన్నికల సంఘంపై నమ్మకం కలిగి, ప్రజాస్వామ్య ప్రాతిపదికగా నిర్వహించే ఎన్నికల్లో చురుకుగా పాల్గొనాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ రాజ్ కోరారు. ఈవీఎంలపై ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టి వేసిందన్నారు. ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు మాత్రమే ఈవీఎంల విశ్వసనీయతను ప్రశ్నించడం తగదన్నారు.
News November 26, 2024
శైలజ మృతి ముమ్మాటికీ ప్రభుత్వ నిర్లక్ష్యమే: హరీశ్ రావు
ఫుడ్ పాయిజన్తో చనిపోయిన వాంకిడి ఆశ్రమ పాఠశాల విద్యార్థిని శైలజ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తున్న నేతలను అడ్డుకోవడంపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థిని ప్రాణాలు కోల్పోవడం ముమ్మాటికీ ప్రభుత్వ నిర్లక్ష్యమేనని అన్నారు. ప్రభుత్వం తమ తప్పేం లేదన్నట్లు వ్యవహరించినంత మాత్రాన విద్యార్థిని ప్రాణం తీసిన పాపం ఊరికే పోదన్నారు.