News August 16, 2024
మెదక్: ఎన్ఎంఎంఎస్ దరఖాస్తుకు సెప్టెంబర్-11 వరకు గడువు
పేద విద్యార్థులకు ప్రతిభా పరీక్ష ఎన్ఎంఎంఎస్ రాత పరీక్ష విధానంలో జాతీయ ఉపకార వేతనాలు అందిస్తోంది. ఉపకార వేతనాలు పొందడానికి 8వతరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులు. విద్యార్థులు bsc.telangana.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చు. నకలు ఆయా పాఠశాల ప్రధానోపాధ్యాయుల ద్వారా జిల్లా విద్యాశాఖ అధికారులకు పంపించాలి. ఎంపికైన విద్యార్థులకు 9-12వ తరగతి వరకు ఏటా12 వేల చొప్పున 48వేల ఉపకారవేతనం అందుతాయి.
Similar News
News November 18, 2024
‘సర్వే ఉపాధ్యాయులను ఇబ్బంది పెట్టడం సరికాదు’
సర్వే చేస్తున్న ఉపాధ్యాయులను కొందరు అధికారులు ఇబ్బంది పెట్టడం సమంజసం కాదు, స్వేచ్ఛనివ్వాలని పిఆర్టీయూ అసోసియేట్ అధ్యక్షులు ఎల్.మల్లారెడ్డి కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న సమగ్ర కులగణన సర్వేలో ఉపాధ్యాయులు ఎంతో ప్రయాస పడి ఒకవైపు పాఠశాలను, మరొక పక్క సర్వేను సమర్థ వంతంగా నిర్వహిస్తున్నారు. ఉపాధ్యాయులతో సమన్వయంగా పని చేయించుకోవాలని సూచించారు.
News November 18, 2024
మాయగాళ్లను నమ్మి మోసపోకండి.. నిరుద్యోగులకు మంత్రి సూచన
ఆరోగ్య శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పే వారి మాటలు నమ్మి మోసపోవద్దని నిరుద్యోగులకు మంత్రి దామోదర రాజనర్సింహ సూచించారు. ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తి పారదర్శకంగా జరుగుతుందన్నారు. మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా 11 నెలల్లోనే 7 వేల పైచిలుకు పోస్టులను భర్తీ చేశామని మంత్రి గుర్తు చేశారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేసేవారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
News November 17, 2024
మెదక్: ప్రజాపాలన విజయోత్సవాలు వాయిదా: కలెక్టర్
మెదక్ పట్టణంలో సోమవారం నిర్వహించే ప్రజా పాలన విజయోత్సవాలు-2024 అనివార్య కారణాలవల్ల వాయిదా వేయడం జరిగిందని కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదివారం రాత్రి 10 గంటలకు తెలిపారు. తదుపరి కార్యక్రమాల తేదీని త్వరలో తెలియజేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గమనించాలని కోరారు. ముందుగా సోమవారం సాయంత్రం ఐదు గంటలకు విజయోత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.