News February 19, 2025
మెదక్: కాంగ్రెస్ ఆ స్థానాన్ని నిలబెట్టుకుంటుందా..?

ఉమ్మడిMDK- KNR- ADB- NZB, పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ మళ్లీ గెలుస్తుందా అని రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. గత ఎన్నికల్లో ఈ స్థానం నుంచి జీవన్‌రెడ్డి గెలిచారు. ప్రస్తుతం కాంగ్రెస్ నుంచి ‘అల్ఫోర్స్’ అధినేత నరేందర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడంతో సిట్టింగ్ స్థానాన్ని తిరిగి కైవసం చేసుకోవడానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది.
Similar News
News March 14, 2025
వికారాబాద్: యువత చట్టాలపై అవగాహన కల్పించుకోవాలి: జడ్జి

యువత చట్టాలపై అవగాహన కల్పించుకోవాలని జిల్లా సేవాధికార సంస్థ సెక్రటరీ జడ్జి శీతాల్ తెలిపారు. వికారాబాద్ పట్టణంలోని శ్రీ అనంతపద్మనాభ ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జడ్జి శీతాల్ మాట్లాడుతూ.. చట్టాలపై అవగాహన కల్పించుకుని బాల్యవివాహాల నిర్మూలనకు యువత కృషి చేయాలన్నారు.
News March 14, 2025
ఆపదలో ఉంటే 100కు ఫోన్ చేయండి: SP

మెదక్ జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ ఉదయ్ కుమార్ మాట్లాడుతూ.. విద్య, ఉపాధి, రాజకీయ రంగాల్లో మహిళల భాగస్వామ్యం పెరగాలని అన్నారు. ఆపద సమయాల్లో అధైర్యపడకుండా వెంటనే డయల్ 100కు సమాచారం అందించాలన్నారు. అనంతరం విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన మహిళలకు
ప్రశంసాపత్రాలు అందించారు.
News March 14, 2025
రాయపర్తి: చేపల వేటకు వెళ్లి మత్స్యకారుడు మృతి

రాయపర్తి మండలం మైలారం గ్రామానికి చెందిన వెంకన్న (38) చేపల వేటకు వెళ్లి నీట మునిగి మృతి చెందాడు. ఎస్సై శ్రవణ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామ మత్స్యకారులతో కలిసి వెంకన్న గురువారం సాయంత్రం తాళ్లకుంటలోకి చేపలు పట్టేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో వల కాళ్లకు చుట్టుకుని నీట మునిగి మృతి చెందాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రవణ్ కుమార్ వివరించారు.