News March 5, 2025

మెదక్: ఘోర రోడ్డు ప్రమాదం.. దంపతులు మృతి

image

మెదక్ జిల్లా నాందేడ్-అకోలా 161 జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బొడ్మట్ పల్లి- చిల్వర్ మధ్యలో హైవే బ్రిడ్జిపై రాంగ్ రూట్‌లో ఎదురుగా వస్తున్న బైకును కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో దంపతులు అక్కడికక్కడే మృతి చెందారు. అల్లాదుర్గంకు చెందిన బండ సాయిలు (55), మణెమ్మగా పోలీసులు గుర్తించారు. బొడ్మట్ పల్లి సంతలో కూరగాయలు అమ్మి ఇంటికి తిరిగి వెళ్తుండగా ప్రమాదం జరిగింది.

Similar News

News March 6, 2025

సంగారెడ్డి: మతిస్తిమితం లేని యువతిపై అత్యాచారం

image

మతిస్తిమితం సరిగ్గాలేని యువతిపై ఓ యువకుడు అత్యాచారానికి ఒడిగట్టిన ఘటన ఆందోల్ మండలంలో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసుల వివరాలు.. ఓ గ్రామానికి చెందిన యువతి(24) చిన్ననాటి నుంచి మతిస్తిమితం లేక పోవడంతో కుటుంబీకులు ఆమెకు పెళ్లి చేయలేదు. యువతి ప్రతిరోజు గ్రామంలో అటు ఇటూ తిరిగి ఇంటికి చేరుకునేది. నాలుగు రోజుల క్రితం శంకర్ అనే యువకుడు మద్యం మత్తులో యువతిని పొలం వద్దకు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు.

News March 6, 2025

మెదక్: MLC కౌంటింగ్.. 60 గంటలు సాగింది

image

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో BJP అభ్యర్థి అంజిరెడ్డి గెలుపొందిన సంగతి తెలిసిందే. కాగా కౌంటింగ్ ప్రక్రియ సుదీర్ఘంగా సాగింది. ఈనెల 3న ఉ. 8 గంటలకు చెల్లుబాటయ్యే ఓట్లు, చెల్లుబాటు కాని ఓట్లను వేరు చేయడం మెుదలు పెట్టగా మంగళవారం ఉ. 10 గంటల వరకు ఈ ప్రక్రియ సాగింది. 11 గంటలకు అభ్యర్థులకు పోలైన ఫస్ట్ ప్రయార్టీ ఓట్ల లెక్కింపు స్టార్ట్ చేయగా బుధవారం 8 గంటలకు అంటే సుమారు 60 గంటల వరకు సాగింది.

News March 6, 2025

సిద్దిపేట: తండ్రి మరణం.. ‘కూతురికి పరీక్ష’

image

తండ్రి చనిపోయిన బాధలోనూ ఓ విద్యార్థిని ఇంటర్ పరీక్ష రాసిన ఘటన సిద్దిపేట జిల్లాలో జరిగింది. వర్గల్‌కు చెందిన పసుల లింగం(50) బైక్‌పై తూప్రాన్‌ వెళ్లి వస్తుండగా నాచారం వద్ద గజ్వేల్ తూప్రాన్ రహదారిపై జరిగిన ప్రమాదంలో మృతి చెందాడు. లింగం కూతురు తేజశ్రీ బుధవారం తండ్రి చనిపోయిన బాధ దిగమింగి ఇంటర్ తొలి రోజు పరీక్ష రాసింది. ఎగ్జామ్ రాసి వచ్చిన అనంతరం తండ్రి మృతదేహాన్ని చూసి బోరున విలపించింది.

error: Content is protected !!