News February 26, 2025
మెదక్ చర్చ్ రిటైర్డ్ గురువు రాబిన్ సన్ కన్నుమూత

మెదక్ సీఎస్ఐ చర్చ్ రిటైర్డ్ గురువు రాబిన్ సన్ మెదక్‌లోని ప్రైవేట్ ఆస్పత్రిలో మృతి చెందారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఆయన బుధవారం కన్నుమూశారు. మెదక్ పట్టణంలోని దాయర వీధికి చెందిన రాబిన్సన్ మెదక్ సీఎస్ఐ చర్చిలో 2010 నుంచి 2019 వరకు ప్రిసిబిటరి ఇన్‌ఛార్జ్‌గా పనిచేశారు. మెదక్ అధ్యక్ష మండలంలో వైస్ ఛైర్మన్‌గా, మినిస్ట్రియల్ కన్వీనర్‌గా తదితర పదవుల్లో పనిచేశారు.
Similar News
News February 27, 2025
మెదక్: MLC ఎన్నికలకు పటిష్ట బందోబస్తు

మెదక్ జిల్లాలో జరగబోయే ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్ MLC ఎన్నికకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ డి. ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద 174 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద 163 BNSS ఆక్ట్ (144 సెక్షన్) అమలులో ఉంటుందన్నారు. కావున ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.
News February 27, 2025
ఏడుపాయల దర్శనానికి పోటెత్తిన భక్తులు

మహాశివరాత్రి సందర్భంగా ఏడుపాయల వనదుర్గా మాత అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. మూడు రోజులపాటు జరిగే మహా జాతర ప్రారంభం కాగా రాష్ట్రంతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి భక్తులు పెద్ద ఎత్తున ఏడుపాయల చేరుకుంటున్నారు. అమ్మవారిని దర్శించుకుని ఉపవాస దీక్షలు విటమించారు. జై దుర్గా, వన దుర్గా అంటూ భక్తుల నినాదాలు మారు మ్రోగాయి. క్యూ లైన్లలో భక్తులు పెద్ద ఎత్తున వేచి ఉన్నారు.
News February 26, 2025
ఏడుపాయల బందోబస్తు పర్యవేక్షించిన ఎస్పీ

పాపన్నపేట మండలం ఏడుపాయల వనదుర్గ మాత మహాశివరాత్రి జాతర పురస్కరించుకొని జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి బందోబస్తు పర్యవేక్షించారు. మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని ఏడుపాయల వనదుర్గమాత వద్ద భారీ ఎత్తున జాతర ఉత్సవాల నిర్వహిస్తున్నారు. ఉత్సవాలను పురస్కరించుకొని భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. తూప్రాన్ డిఎస్పీ వెంకటరెడ్డి, మెదక్ డిఎస్పీ, జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి బందోబస్తు పర్యవేక్షించారు.