News February 12, 2025

మెదక్: చెరువులో పడి 6ఏళ్ల చిన్నారి మృతి

image

మెదక్‌లోని తూప్రాన్ పెద్ద చెరువులో పడి ఆరేళ్ల చిన్నారి మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణానికి చెందిన చాంద్ పాషా, పర్వీన్ కుమార్తె జుబేరియా(6) బుధవారం ఉదయం తల్లితో కలిసి పెద్ద చెరువు వద్దకు బట్టలు ఉతికేందుకు వెళ్లింది. ఈ క్రమంలో తల్లి బట్టలు ఉతుకుతుండగా మెట్లపై ఆడుకుంటున్న జుబేరియా ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News February 13, 2025

కేటిదొడ్డి: కర్ణాటక-తెలంగాణ సరిహద్దులో తనిఖీలు

image

బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్‌తో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. కర్ణాటక – తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో తనిఖీలు ముమ్మరం చేశారు. కేటిదొడ్డి మండలం నందిన్నె చెక్ పోస్టు వద్ద వెటర్నరీ అధికారి‌ డాక్టర్ నవీన్ చంద్ర, ఎక్సైజ్ కానిస్టేబుల్ జగదీష్ సంయుక్తంగా తనిఖీలు చేపట్టారు. కర్ణాటక నుంచి సరఫరా అయ్యే కోళ్లకు సంబంధించి వాహనాలను తనిఖీ చేశారు.

News February 13, 2025

NZB: 70 శాతం సీసీ కెమెరాలు పనిచేయడం లేదు: కవిత

image

భద్రత కోసం మహిళలు పోరాటం చేయాల్సిరావడం బాధాకరమని జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. బుధవారం నిర్వహించిన మహిళా జాగృతి సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ఆడపిల్ల కాలేజీకి వెళ్తే ఇంటికొచ్చే వరకు ఎదురుచూసే పరిస్థితి ఏర్పడిందన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు 70 శాతం పనిచేయడం లేదని ఆరోపించారు.

News February 13, 2025

వనపర్తి: ‘వెట్టి చాకిరి నుంచి విముక్తి కల్పించాలి’

image

బాలలను వెట్టిచాకిరి నుంచి విముక్తి కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం స్వచ్ఛంద సంస్థలపై ఉందని వనపర్తి జిల్లాన్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి వి రజని అన్నారు. బాలల బెట్టి చాకిరి నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం జిల్లా కోర్టు ఆవరణలో అంతర్జాతీయ న్యాయమిషన్ వారు రూపొందించిన పోస్టర్లను ఆవిష్కరించారు. రజిని మాట్లాడుతూ.. బాండడ్ లేబర్‌కు వ్యతిరేకంగా ఈమాసంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.

error: Content is protected !!