News February 14, 2025

మెదక్: చోరీ కేసులో నిందితుడు అరెస్ట్

image

నర్సాపూర్ మండలం ఎర్రకుంట తండాలో జరిగిన చోరీ కేసులను పోలీసులు ఛేదించారు. ఈనెల ఒకటో తేదీన శ్రీను ఇంట్లో గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడగా, కేసు నమోదు చేసిన పోలీసులు నమ్మదగిన సమాచారం మేరకు బాధితుడి అన్న కొడుకు మూడవ అంజ్యాను అరెస్టు చేసి అతని నుంచి రూ.2.60లక్షల నగదుతో పాటు వెండి పట్టగొలుసులను స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించినట్లు సీఐ జాన్ రెడ్డి తెలిపారు.

Similar News

News February 21, 2025

రామాయంపేట: విద్యుత్ షాక్ తగిలి వ్యక్తి మృతి

image

ఇంట్లో ఫ్యాన్ రిపేర్ చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన రామాయంపేట మండలంలో గురువారం చోటుచేసుకుంది. ఎస్ఐ బాలరాజు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని లక్ష్మాపూర్ గ్రామానికి చెందిన పొట్టినోళ్ల నర్సింలు(55) అనే వ్యక్తి బుధవారం రాత్రి తన ఇంట్లో ఫ్యాన్ రిపేర్ చేస్తున్న క్రమంలో విద్యుత్ షాక్ తగిలి కింద పడిపోయాడు. ఆస్పత్రికి తరలించేలోపు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

News February 20, 2025

మెదక్ జిల్లాలో విద్యుత్ ఆర్టిజన్ ఉద్యోగుల ముందస్తు అరెస్టులు

image

మెదక్ జిల్లా వ్యాప్తంగా విద్యుత్ ఆర్టిజన్ ఉద్యోగులను ముందస్తుగా పోలీసులు అరెస్టులు చేస్తున్నారు. విద్యుత్ ఆర్టిజన్ ఉద్యోగులను కన్వర్షన్ (రెగ్యులర్) చేయాలన్న పిలుపుతో ఆర్టిజన్ ఉద్యోగులు చలో హైదరాబాద్ విద్యుత్ సౌదాకు పిలుపునిచ్చారు. యూనియన్ నాయకుల పిలుపుమేరకు చలో విద్యుత్ సౌదా వెళ్లకుండా జిల్లా వ్యాప్తంగా పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు.

News February 20, 2025

సంగారెడ్డి: కల్లు కోసం వచ్చి స్నేహితులు మృతి

image

జిన్నారం PS పరిధిలో<<15514933>> చెరువులో మునిగి<<>> ఇద్దరు యువకులు మృతి చెందారు. పోలీసుల వివరాలిలా.. మేడ్చల్ జిల్లా గాగిల్లాపూర్‌కు చెందిన స్నేహితులిద్దరూ నరేష్, శంకర్ మంగళవారం సాయంత్రం వావిలాలలో కల్లు తాగేందుకు బైక్ పై వచ్చారు. తిరిగి వెళ్లే క్రమంలో ఈత కొట్టేందుకు పీర్ష చెరువులోకి దిగి మునిగిపోయారు. ఈతగాళ్లతో పోలీసులు గాలింపు చేపట్టగా మృతదేహాలు నిన్న దొరికాయి. స్నేహితులిద్దురి మృతి గ్రామంలో విషాదం నింపింది.

error: Content is protected !!