News April 16, 2025
మెదక్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి లక్ష్మి శారదా బదిలీ

మెదక్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి లక్ష్మి శారదా బదిలీ అయ్యారు. మెదక్ జిల్లాకు కొత్త న్యాయమూర్తిగా జగిత్యాల జిల్లా నుంచి నీలిమ రానున్నారు. ఇక్కడి నుంచి లక్ష్మి శారదా సూర్యాపేటకు బదిలీ అయ్యారు. లక్ష్మి శారదా ఇక్కడ 2022 జూన్ 2 నుంచి పనిచేస్తున్నారు. లక్ష్మి శారదా హయాంలో 2వ అంతస్తు నిర్మాణానికి శంకుస్థాపన, కొత్త కోర్టులు మంజూరు చేయించారు.
Similar News
News December 29, 2025
సమస్యల పరిష్కారానికే ప్రజావాణి: MDK కలెక్టర్

సమస్యల పరిష్కారానికి ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి మొత్తం 64 ఫిర్యాదులు స్వీకరించారు. వీటిలో భూ భారతి 21, ఇందిరమ్మ ఇళ్లు 11, పెన్షన్లు 12, ఇతర అంశాలపై 20 దరఖాస్తులు ఉన్నాయి.
News December 29, 2025
మెదక్ స్టేడియంలో అథ్లెటిక్స్ జిల్లా స్థాయి ఎంపికలు

మెదక్ అథ్లెటిక్స్ స్టేడియంలో సోమవారం జిల్లా స్థాయి ఎంపికలు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా డీఎస్పీ ప్రసన్నకుమార్ రన్ ప్రారంభించారు. అనంతరం గెలుపొందిన క్రీడాకారులకు డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ప్రొ.కె.హుస్సేన్, రెనాగుప్త ఎన్జీవోస్ ఆర్గనైజర్ మెడల్స్ అందజేశారు. ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు గచ్చిబౌలిలో రాష్ట్ర స్థాయి పోటీలో పాల్గొంటారని మెదక్ జిల్లా అథ్లెటిక్స్ కార్యదర్శి మధుసూదన్ తెలిపారు.
News December 29, 2025
మెదక్: ప్రజావాణిలో ఫిర్యాదులు స్వీకరించిన ఎస్పీ

మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా ఎస్పీ డీవీ. శ్రీనివాస రావు ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. జిల్లాలోని పలు గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను నేరుగా ఎస్పీకి వివరించారు. ప్రతి ఫిర్యాదును వ్యక్తిగతంగా పరిశీలించి, సంబంధిత సీఐలు, ఎస్‌ఐలకు తక్షణ చర్యల కోసం ఆదేశాలు జారీ చేశారు.


