News January 26, 2025

మెదక్: జిల్లా వ్యాప్తంగా మొత్తం 544 సభలు: కలెక్టర్

image

మెదక్ జిల్లా వ్యాప్తంగా 21 నుంచి 23 వరకు 469 గ్రామ సభలు నిర్వహించినట్టు మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు ఆయన మాట్లాడుతూ.. మెదక్ జిల్లా వ్యాప్తంగా 75 వార్డు సభలు నిర్వహించామన్నారు. జిల్లా వ్యాప్తంగా రేషన్ కార్డుకు 40,092, ఇందిరమ్మ ఇళ్లకు 23,383, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు 5,501, రైతు భరోసాకు 308 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు.

Similar News

News January 27, 2025

మెదక్: యువకుడు MISSING.. కేసు నమోదు

image

కుటుంబ కలహాల నేపథ్యంలో ఇంటి నుంచి వెళ్లిన ఓ వ్యక్తి అదృశ్యమైన ఘటన మెదక్ జిల్లా చిలప్‌చెడ్ మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. మండల పరిధిలోని గంగారం గ్రామానికి చెందిన యువకుడు రాజు కుటుంబ కలహాల నేపథ్యంలో ఈనెల 20న ఇంటి నుంచి వెళ్లి ఇంతవరకు తిరిగిరాలేదు. బంధువుల వద్ద వెతికినా ఆచూకీ లభించకపోవడంతో ఈరోజు కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News January 27, 2025

మెదక్ జిల్లాలో 14,833 రైతులకు రూ.14.06 కోట్లు జమ

image

మెదక్ జిల్లాలో 21 మండలాల్లోని 21 గ్రామాలకు చెందిన 14,833 రైతులకు రూ.14.06 కోట్లు రైతు భరోసా కింద అకౌంట్లలో జమ అయ్యాయి. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు మండలంలో ఒక గ్రామాన్ని ఎంపిక చేసి 4 పథకాలకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ముందుగా ఎంపిక చేసిన గ్రామాల రైతులకు డబ్బులు జమ అవుతున్నాయి. అకౌంట్లలో డబ్బులు జమ కావడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

News January 27, 2025

మెదక్: అదనపు ఎస్పీ ఆధ్వర్యంలో ప్రజావాణి కార్యక్రమం

image

మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా అదనపు ఎస్పీ మహేందర్ ప్రజావాణి కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించారు. ఫిర్యాదుదారుల సమస్యలను విని వాటిని చట్టప్రకారం పరిష్కరించాల్సింది సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రజలు నిర్భయంగా, మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా ఎలాంటి పైరవీలు లేకుండా స్వచ్ఛందంగా పోలీసు సేవలను వినియోగించుకుంటూ, వారి వారి సమస్యలు చట్ట ప్రకారం పరిష్కరించుకోవాలని సూచించారు.