News February 26, 2025
మెదక్ జిల్లాలో ఇంటర్ విద్యార్థులు 14,224 మంది

మెదక్ జిల్లాలో 14,224 మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ పరీక్షలు రాయనున్నట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. మంగళవారం ఆయన ఆయా శాఖల అధికారులతో కలిసి ఇంటర్మీడియట్, 10వ తరగతి వార్షిక పరీక్షల ఏర్పాట్లపై సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షల కోసం 30 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.
Similar News
News February 26, 2025
MLC ఎన్నికలకు 174 మందితో బందోబస్త్: ఎస్పీ

రేపు జరుగనున్న MLC ఎన్నికలకు సంబంధించి జిల్లాలో అన్ని మండల కేంద్రాల్లో మొత్తం పోలింగ్ కేంద్రాల్లో ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్ MLC ఎన్నికల పోలింగ్ కేంద్రాల వద్ద 174 మంది పోలీసు సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నట్లు ఎస్పీ డి. ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు. 8 రూట్లలో ఆయుధ పహారాలో పోలింగ్ సామాగ్రిని తరలించడం జరుగుతుందన్నారు. స్ట్రైకింగ్ ఫోర్స్, QRTలు, డీఎస్పీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశామన్నారు.
News February 26, 2025
పాపన్నపేట: యువకుడి మృతదేహం లభ్యం

ఏడుపాయల వనదుర్గ ప్రాజెక్టు కాలువలో గుర్తుతెలియని మృతదేహం మంగళవారం లభ్యమైనట్లు పాపన్నపేట ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. గజ ఈతగాళ్ల సహాయంతో మృతదేహాన్ని బయటకు తీసినప్పటికీ అతడి ఆచూకీ లభించలేదన్నారు. మృతుడి వయసు సుమారు 30 ఏళ్లు ఉండి ఒంటిపై పచ్చని టీ షర్ట్, నల్లని షర్ట్, నిక్కరు ఉందని, ఆచూకీ తెలిస్తే స్టోషన్లో సంప్రదించాలన్నారు.
News February 26, 2025
మెదక్: ఎమ్మెల్సీ ఎన్నికలకు పటిష్ఠ భద్రత: SP

మెదక్ జిల్లాలో ఈనెల 27న జరగనున్న పట్టభద్రుల, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశామన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూడాలని సంబంధిత పోలీస్ అధికారులకు సూచించారు.