News March 18, 2025

మెదక్: టెన్త్ పరీక్షల పరిశీలన అధికారిగా ఉషారాణి

image

మెదక్, సంగారెడ్డి జిల్లాలో ఈనెల 21 నుంచి జరిగే పదో తరగతి పబ్లిక్ పరీక్షల పరిశీలన అధికారిగా ఉషారాణి నియమితులయ్యారు. హైదరాబాద్‌లోని వయోజన విద్యా శాఖలో డైరెక్టర్‌గా పని చేస్తున్న ఉషారాణిని నియమిస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసిందని DEO వెంకటేశ్వర్లు తెలిపారు. పరీక్షలు పూర్తయ్యే వరకు జిల్లాలోని పరీక్ష కేంద్రాలను పరిశీలిస్తారని పేర్కొన్నారు.

Similar News

News March 19, 2025

మెదక్‌లో తల్లీకూతురు మిస్సింగ్.. కేసు నమోదు

image

మెదక్ పట్టణం బ్రాహ్మణ వీధికి చెందిన చెందిన ఎం. విజయలక్ష్మి(54) తన కూతురు ఎం. మణిదీపిక (27)లు సోమవారం మిస్ అయ్యారు. మెదక్‌లోని వారి ఇంట్లో నుంచి వెళ్లిన వీరు ఇద్దరూ కనిపించట్లేదని కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీరు ఎక్కడైనా కనిపిస్తే 8712657878, 8712657913 నెంబర్లకు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని టౌన్ ఇన్స్పెక్టర్ నాగరాజు సూచించారు.

News March 19, 2025

మెదక్: భట్టి బడ్జెట్‌లో వరాలు కురిపిస్తారా..!

image

నేడు అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌పై మెతుకుసీమ ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. సాగునీటి కేటాయింపులపై సర్వాత్రా ఆసక్తి నెలకొంది. మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాల్లో నీటిని అందించే ప్రాజెక్టులకు నిధుల కేటాయింపుపై ఆశలు పెట్టుకున్నారు. రామాయంపేట రెవెన్యూ డివిజన్ ఏర్పాటులో జాప్యం, పెండింగ్ పనులు, విద్యా, వైద్య రంగాల్లో అనిశ్చితి తొలిగేలా జిల్లాలో చేపట్టే కొత్త ప్రాజెక్టుల కోసం ఎదురుచూస్తున్నారు.

News March 19, 2025

మెదక్ యువతకు GOOD NEWS

image

రాజీవ్ యువ వికాసం పథకం దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. దీంతో మెదక్ జిల్లాలోని SC, ST, BC, మైనార్టీ నిరుద్యోగుల్లో ఆశలు చిగురించాయి. జిల్లాలో 1.55 లక్షల మంది యువత ఉన్నారు. ఏప్రిల్ 5 వరకు http:///tgobmmsnew.cgg.gov.in లో అప్లై చేసుకుంటే జూన్ 2 అర్హుల తుది జాబితా ప్రకటిస్తారు. దీనికి సంబంధించి మార్గదర్శకాలను త్వరలో వెల్లడించనున్నారు. ఎంచుకునే యూనిట్‌ని బట్టి రూ.3 లక్షల వరకు ఇవ్వనున్నారు.

error: Content is protected !!