News March 4, 2025
మెదక్: తమ్ముడి దాడిలో అన్న మృతి

తమ్ముడు దాడి చేయడంతో అన్న మృతి చెందిన ఘటన మాసాయిపేట మండల కేంద్రంలో జరిగింది. స్థానికుల వివరాలు.. మాసాయిపేటకు చెందిన దుంపల రాజు, అతని తమ్ముడు చందు కుటుంబ కలహాల నేపథ్యంలో సోమవారం రాత్రి గొడవపడ్డారు. ఈ గొడవలో తమ్ముడు అన్న రాజుపై దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందారు. బంధువులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News March 4, 2025
అల్లూరి జిల్లాలో టుడే టాప్ న్యూస్

➤ అల్లూరి: వాట్సాప్ ద్వారా 10వ తరగతి హాల్ టిక్కెట్లు
➤ గంగవరం: అల్లూరి జిల్లాలో లక్ష్యానికి మించి పనిదినాలు
➤ ఢిల్లీ వెళ్లిన అల్లూరి జిల్లా కలెక్టర్
చింతపల్లి: సచివాలయంలో యువకుడు హల్‌చల్
➤ రంపచోడవరం పాఠశాలలపై మంత్రి కీలక ప్రకటన
➤హైవే అధికారులపై పాడేరు ఎమ్మెల్యే ఆగ్రహం
➤ పెదబయలు హౌసింగ్ ఏఈపై విచారణ జరిపించాలి: బీజేవైఎ
➤పాడేరు కలెక్టరేట్‌ను ముట్టడిస్తాం: ఆశాలు
News March 4, 2025
ఎన్నికల కోడ్ ఎత్తివేత: కలెక్టర్ అంబేడ్కర్

రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వెల్లడించడంతో ఎన్నికల ప్రవర్తన నియమావళి ఎత్తివేస్తూ ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీచేసినట్లు విజయనగరం కలెక్టర్ బీఆర్ అంబేడ్కర్ తెలిపారు. ఇకపై అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశించారు. ప్రజా ప్రతినిధులను సమన్వయం చేసుకుంటూ పనిచేయాలని సూచించారు.
News March 4, 2025
సంగారెడ్డి: ఎమ్మెల్సీ ఎన్నికలు.. అంజిరెడ్డి ముందంజ

కరీంనగర్, మెదక్, అదిలాబాద్, నిజామాబాద్ ఎమ్మెల్సీ పట్టభద్రుల నియోజకవర్గ ఫలితాలు రెండు రోజులుగా కొనసాగుతున్నాయి. 4వ రౌండ్ అనంతరం ఫలితాలను ఎన్నికల అధికారులు ప్రకటించారు. బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి 30,961ల ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి 25,363ల ఓట్లు, బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ 21,248ల ఓట్లు సాధించారు. బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి 5,598ల ఓట్లు ఆధిక్యంలో ఉన్నారు.