News March 30, 2025

మెదక్: ‘తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు’

image

మెదక్ జిల్లాలో నేటి నుంచి జూన్ 1 వరకు ప్రభుత్వ, ప్రైవేటు ఇంటర్ కళాశాలలకు వేసవి సెలవులు ప్రకటిస్తూ ఇంటర్ బోర్డు శాఖ ఉత్తర్వులు జారీ చేసిందని జిల్లా ఇంటర్మీడియట్ అధికారి మాధవి తెలిపారు. ఈ సందర్భంగా ఇంటర్మీడియట్ అధికారి మాట్లాడుతూ.. సెలవులలో తరగతులు నిర్వహిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Similar News

News April 2, 2025

తూప్రాన్: గుండ్రెడ్డిపల్లిలో ఒకరు ఆత్మహత్య

image

తూప్రాన్ మండలం గుండారెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఒకరు ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. గుండారెడ్డిపల్లి గ్రామానికి చెందిన అరకల శ్రీనివాస్(52) రాత్రి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయం తలుపులు తీయకపోవడంతో పక్కింటి వారు అనుమానం వచ్చి తలుపులు తొలగించి చూడగా ఉరివేసుకొని కనిపించాడు. భార్యా పిల్లలు హైదరాబాదులో ఉంటున్నట్లు గ్రామస్థులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 2, 2025

మెదక్: వేర్వేరు ఘటనల్లో ముగ్గురి మృతి

image

ఉమ్మడి MDK జిల్లావ్యాప్తంగా నిన్న వేర్వేరు ఘటనల్లో ముగ్గురు మృతిచెందారు. మనోహరాబాద్ మండలం కొండాపూర్ పారిశ్రామికవాడలోని శ్రీయాన్ పాలిమర్ పరిశ్రమలో MPకి చెందిన రఘునాథ్ సింగ్ అనే కార్మికుడు కరెంటు షాకుతో చనిపోయాడు. ఆర్సీపురం పోలీసుస్టేషన్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో బీరంగూడ వాసి శిరీష(22) చికిత్స పొందుతూ మృతిచెందింది. MDKలో స్విమ్మింగ్‌పూల్‌లో మునిగి మహ్మద్ హఫీజ్(24)అనే యువకుడు చనిపోయాడు.

News April 2, 2025

మెదక్: విద్యుదాఘాతంతో కార్మికుడి మృతి

image

మనోహరాబాద్(M) కొండాపూర్ పారిశ్రామికవాడలో శ్రీహన్ పాలిమర్ కంపెనీలో మధ్యప్రదేశ్(S) అనుపూరు జిల్లా బలియా గ్రామానికి చెందిన రఘునాథ్ సింగ్(21) అనే కార్మికుడు మృతిచెందాడు. మంగళవారం ఉదయం విధులు నిర్వహిస్తుండగా మిషన్‌‌కు చెందిన వైర్ తగలడంతో షాక్‌కు గురై చనిపోయాడు. యజమాని నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందని మృతుడి సోదరుడు ఆరోపించాడు. మనోహరాబాద్ ఎస్సై సుభాష్ గౌడ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

error: Content is protected !!