News March 7, 2025

మెదక్: నీటి సరఫరాలో అంతరాయం లేకుండా చర్యలు: కలెక్టర్

image

ఈ వేసవిలో నీటి సరఫరాలో అంతరాయం లేకుండా, క్షేత్ర స్థాయిలో సమస్యలు తలెత్తకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. గురువారం మెదక్ కలెక్టరేట్ సమావేశ హాలులో సమ్మర్ యాక్షన్ ప్లాన్ పై అదనపు కలెక్టర్ నగేష్‌తో కలిసి సమీక్షించారు. తాగునీటి పంపిణీలో సమస్యలు ఏర్పడితే ప్రత్యామ్నాయ చర్యలు ద్వారా నీటిని సరఫరా చేసేందుకు నిర్దిష్టమైన కార్యాచరణ రూపొందించాలని అన్నారు.

Similar News

News March 9, 2025

మడూర్ విద్యార్థికి జిల్లా జడ్జి సన్మానం

image

మెదక్ జిల్లాలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మెదక్ జిల్లా సివిల్ జ్యుడీషియల్ జడ్జి లక్ష్మి శారద చేతుల మీదుగా చిన్నశంకరంపేట మం. మడూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థిని అంకిత సన్మానం అందుకున్నారు. వారణాసిలో జరిగిన జాతీయస్థాయి వాలీబాల్ పోటీల్లో పాల్గొన్న అంకిత ప్రతిభను గుర్తించి ఈ సన్మానం చేసినట్టు పాఠశాల HM రవీందర్ రెడ్డి, పీడీ నరేశ్ తెలిపారు.

News March 8, 2025

రేగోడ్: మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి: మంత్రి

image

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని, మహిళాభివృద్ధి, సాధికారతకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి దామోదర్ అన్నారు. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా మంత్రుల నివాసంలో ప్రైవేటు ఉద్యోగుల సంఘం మహిళా విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా దినోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి స్వీట్లు పంపిణీ చేశారు. మహిళలకు శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.

News March 8, 2025

మెదక్: డీఎడ్ ఫస్టియర్ ఫలితాలు విడుదల

image

డిసెంబర్-2024లో జరిగిన డీఎడ్ మొదటి సంవత్సరం పరీక్ష ఫలితాలను ప్రభుత్వ పరీక్షల విభాగం విడుదల చేసిందని, పాఠశాల విద్యాశాఖ అధికారులు శనివారం తెలిపారు. ఈ ఫలితాల కొరకు https://bse.telangana.gov .in/ వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చని సూచించారు. రీకౌంటింగ్‌కు ఈనెల 24లోగా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు పేర్కొన్నారు.

error: Content is protected !!