News March 25, 2025
మెదక్ పట్టణంలో ATM వద్ద మోసాలు.. జాగ్రత్త

మెదక్‌లో ఓ బ్యాంక్ ATM వద్ద ఇద్దరు వ్యక్తులు డబ్బులు డ్రా చేసి మోసాలకు పాల్పడుతున్నారు. ATM వద్ద నిలబడి ఎవరికైతే డబ్బులు డ్రా చేయడం రాదో వారినే టార్గెట్ చేస్తూ డబ్బులు తీసి ఇస్తానని చెప్పి కార్డును మార్చేస్తున్నారు. తన దగ్గర ఉన్న మరో కార్డును వారికిచ్చి అక్కడ నుంచి వెళ్లి వేరే ప్రాంతాల్లో డబ్బులు డ్రా చేస్తున్నట్లు టౌన్ ఇన్స్పెక్టర్ నాగరాజు తెలిపారు. ఈ కొత్త తరహా మోసాలతో జాగ్రత్తంగా ఉండాలన్నారు.
Similar News
News March 28, 2025
సంగారెడ్డిలో మరో విషాదం..

SRD జిల్లాలో మరో విషాదం జరిగింది. కోహిర్ మండలం పైడిగుమ్మల్‌లోని వ్యవసాయ బావిలో పడి ఇద్దరు కార్మికులు మరణించారు. మృతులను UPకి చెందిన బైద్యనాథ్ భట్, ఒడిశావాసి హరిసింగ్‌గా గుర్తించారు. పైడిగుమ్మల్‌లోని వెంచర్‌లో పనిచేసేందుకు వీరిద్దరు వలస వచ్చారు. వీరు ఈనెల 10న అదృశ్యం కాగా 13న కోహిర్ PSలో కేసు నమోదైంది. గురువారం రాత్రి వ్యవసాయ బావిలో కార్మికుల మృతదేహాలను గుర్తించి వెలికితీసినట్లు పోలీసులు తెలిపారు.
News March 28, 2025
మెదక్ జిల్లాలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

మెదక్ జిల్లాలో గడచిన 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రత వివరాలను వాతావరణ శాఖ వెల్లడించింది. చేగుంట 40.0, నిజాంపేట్, హవేలిఘనపూర్ 39.9, కౌడిపల్లి 39.8, చిలపిచెడ్, నర్సాపూర్, కుల్చారం 39.7, పెద్దశంకరంపేట్, మెదక్ 39.6, అల్లాదుర్గ్ 39.5, రేగోడ్ 39.4, వెల్దుర్తి 39.2, పాపాన్నపేట్ 39.1, టేక్మాల్ 38.8°Cల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.
News March 28, 2025
సంగారెడ్డి: ముగ్గురు పిల్లలకు విషం ఇచ్చి చంపిన తల్లి..

సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో విషాదం చోటుచేసుకుంది. తన కడుపున పుట్టిన ముగ్గురు పిల్లలకు ఓ తల్లి విషం ఇచ్చి తానూ సేవించింది. కాగా, విషం తాగిన తల్లి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆమెను ఆస్పత్రికి తరలించారు. మృతులు.. గౌతమ్(8), సాయికృష్ణ(12), మధుప్రియ(10). మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.